‘వైఎస్‌ఆర్ వాహనమిత్ర | YSR Vahana Mitra మూడో ఏడాది ఆర్థిక సాయం విడుదల పూర్తి వివరాలు. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది.
వైఎస్‌ఆర్ వాహనమిత్ర
కరోనా కష్టకాలంలో ఉపాధి లేక చేతిలో డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆటో మాక్సి క్యాబ్ టాక్సీ డ్రైవర్ లకు ఏపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది వైయస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా బాసటగా నిలిచింది.
ప్రతి ఆటో డ్రైవర్ కు మంచి జరిగేలా సొంత వాహనం కలివి ఆక్సిస్ మాక్స్ క్యాబ్ డ్రైవర్గా ప్రతిరోజు సేవలందిస్తూ రోజూ లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరే వేస్తున్న అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లకు అందరికీ పాదయాత్ర సమయంలో ఏలూరు సభలో 2018 మే 14వ తేదీన ఇచ్చిన మాట ప్రకారం మాటకు కట్టుబడి ఏపీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా వైయస్సార్ వాహన మిత్ర పథకాన్ని అమలు పరిచింది.
వరుసగా మూడో సంవత్సరం వైయస్సార్ వాహన మిత్ర పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆటో క్యాబ్ డ్రైవర్లు బ్యాంకు ఖాతాలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా నగదు డబ్బు జమ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే దేశంలో ఆటో క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంది మరే రాష్ట్రంలో ఇలాంటి పథకం లేదని సీఎం జగన్ తెలిపారు విపత్కర పరిస్థితుల్లో ఈ ఆర్థిక సాయం ఎంతో మేలు చేస్తుందని వాహనాల భీమా తోపాటు ఫిట్నెస్ సర్టిఫికెట్ పదివేల రూపాయలు ఇస్తున్నామని పేర్కొన్నారు.
ఇక అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సాయం చేస్తామని ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అని పేర్కొన్నారు ఇంకా వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి దరఖాస్తు చేసుకుని వారికి మరో నెల రోజుల పాటు గడువు ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల కలెక్టర్లు రవాణా శాఖ అధికారులు,వాహనమిత్ర లబ్ధిదారులు పాల్గున్నారు.వాహనమిత్ర లబ్ధి దారులకు అర్హత ఉండి నగదు రాకపోతే ఇలా చేయండి లబ్ధిదారులకు ఏవైనా సందేహాలుంటే 91542 94326 కాల్ చేయవచ్చు. 1902కు ఫోన్ చేయవచ్చు.