ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ వైయస్సార్ సున్నా వడ్డీ పథకం.! కొత్త తేది ఫిక్స్

ఏపీలో అక్క చెల్లెమ్మలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైయస్సార్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి కొత్త తేదీని విడుదల చేశారు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలు తీసుకున్న లోన్స్ను సక్రమంగా తిరిగి చెల్లించుటకు వారిపై పడే వడ్డీ భారాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం పేరుతో ఈ స్కీం అమలు చేస్తున్నారు. ఇక ఈ పథకం ద్వారా అర్హత గల ప్రతి స్వయం సహాయక సంఘంలో మహిళలకు మూడు లక్షల లోపు అప్పు ఉన్నవారికి వడ్డీ ప్రయోజనం చేకూరుతుంది.

వైయస్సార్ సున్నా వడ్డీ

ఇక ఈ తేదీ నాటికి అప్పు తీసుకున్న స్వయం సహాయక సంఘాలు మరియు ఈ తేదీ నుండి కొత్తగా రుణం పొంది క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తున్న స్వయం సహాయక సంఘాల వారికి సున్నా వడ్డీ పథకానికి అర్హులు.

ఈ పథకం మనకు జూలై 26వ తేదీనే నిర్వహించాల్సింది అయితే నాలుగో విడత వైయస్సార్ సున్నా వడ్డీ కార్యక్రమం అమలాపురంలో అధిక వర్షాల వల్ల ఈ స్కీం వాయిదా వేయడం జరిగింది. అయితే ఆగస్టు 10వ తేదీన వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అమలు చేయబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.9.48 లక్షల గ్రూపులోని మహిళలకు ఈ పథకం ద్వారా కోట్లు ఇవ్వనున్నారు ఈ నాలుగేళ్లలో ఏపీ ప్రభుత్వం సుమారు 5000 కోట్లు అక్కాచెల్లెమ్మల ఖాతాలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద జమ చేసింది.

కావాల్సిన పత్రాలు:

  • డ్వాక్రా గ్రూప్ కలిగిన బ్యాంక్ ఖాతా పాసుబుక్
  • పొదుపు సంఘం రిజిస్టర్
  • ఆధార్ కార్డు

దరఖాస్తు చేయు విధానం

వైయస్సార్ సున్నా వడ్డీ పథకానికి అర్హత ఉండి ఇంకా లబ్ధి పొందే మహిళలు ఎవరైనా ఉంటే దగ్గర్లోని సంబంధిత గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శించబడిన అర్హుల జాబితాను వివరంగా పరిశీలించాలి
దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 155251 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.జాబితాలో పేర్లు నమోదు కానట్లయితే మీ సమీప గ్రామ అవార్డు సచివాలయంలో కానీ వాలంటీర్లకు గాని మీ వివరాలు అందజేసి దరఖాస్తు చేసుకోవాలి

SHG ID లేదా member ID ద్వారా మీ గ్రూపు వివరాలు తెలుసుకోండి LINK http://ikp.serp.ap.gov.in/mepmaap/view/Reports/SHGandMemberIDSearch.aspx

Leave a Comment