ఆంధ్రప్రదేశ్ రైతులకు ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది రాష్ట్రంలో అధికారం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నదాతలకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. వైయస్సార్ రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా వంటి పలు పథకాలు రైతులకు అందించింది. ఇక రైతు భరోసా కేంద్రాల ద్వారా నిరంతరం వారికి అవసరమైన సేవలు అందిస్తుంది అలాగే మార్కెట్లో రైతులు వేసే ప్రతి పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
వైఎస్సార్ సున్నా వడ్డీ
అన్నదాతలకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది వైయస్సార్ సున్నా వడ్డీ పథకం రాయితీ డబ్బును నవంబర్ 29వ తేదీన రైతుల బ్యాంకు ఎకౌంట్లో నేరుగా జమ చేయనుంది ఖరీఫ్ 2021 రబ్బి 2021 సీజన్లకు సంబంధించి లక్ష రూపాయలు లోపు బ్యాంకు నుంచి క్రాప్ లోన్ తీసుకొని గడువులోగా చెల్లించిన వారికి వైయస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ సొమ్మును ప్రభుత్వం ఖాతాలో వెయ్యనుంది.
సున్నా వడ్డీ
ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను రైతు భరోసా కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉంచనున్నారు రైతులు వీటిని సమీక్షించి ఏమైనా మార్పులు తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. Https://karshak.ap.gov.in/ysrsvpr అధికారిక వెబ్సైట్లోకి ‘know your status’ వెళ్లి విండోలో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే వివరాలు డిస్ ప్లే అవుతాయి,కూడా లబ్ధిదారులు తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు ఇక అర్హత ఉండి జాబితాలో పేరు లేకపోతే బ్యాంకు అధికారి ధ్రువీకరణ పత్రాన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఇస్తే వాటిని పరిశీలించి అధికారులు లబ్ధిదారుల తుది జాబితాలో పేర్లు చేరుస్తారు.
వైఎస్సార్ సున్నా వడ్డీ : ఇక వైయస్సార్ సున్నా వడ్డీ రాయితీ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే బ్యాంకు నుంచి అన్నదాతలు లక్షలు రుణాలు తీసుకొని గడువులోగా బ్యాంకులో తిరిగి చెల్లించిన వారికి ఈ వైయస్సార్ సున్నా వడ్డీ డబ్బులను ప్రభుత్వం జమ చేస్తుంది.
ఇక సున్నా వడ్డీ పథకం తో ఎంతో మంది రైతులు లబ్ది పొందుతుతారు.