YSR Kalyanamastu Scheme – వైఎస్ఆర్ కల్యాణమస్తు పథకం కొత్త రూల్స్ దరఖాస్తు పూర్తి వివరాలు

వైఎస్ఆర్ కల్యాణమస్తు | ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పధకం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు కాబోతుంది. ఈ పథకానికి సంబంధించి తాజాగా అర్హతలు నిబంధనలను సడలించింది ఏపీ ప్రభుత్వం.

వైఎస్ఆర్ కల్యాణమస్తు

ఈ పథకానికి సంబంధించి అర్హత నిబంధనలు తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది వైఎస్ఆర్ కళ్యాణమస్తు స్కీం కింద వధూవరులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ముస్లింలకు షాదీ తోఫా పథకాలు వర్తిస్తాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం షరతు పెట్టింది.

ఇక వైయస్సార్ కళ్యాణమస్తు పథకం కింద బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు భవన కార్మిక కుటుంబాలకు ఈ స్కీం వర్తిస్తుంది పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు చేయూతగా నిలిచేందుకు గౌరవప్రదంగా వారి పెళ్లి జరిపించేందుకు తోడ్పాటుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది.

  • ఎస్సీలకు వైయస్సార్ కళ్యాణమస్తు పథకం కింద లక్ష రూపాయలు అందిస్తారు.
  • ఇక ఎస్టీలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు కింద లక్ష రూపాయలు.
  • ఎస్సీలకు కులాంతర వివాహాలకు 1,20,000 /- లక్ష ఇరవై వేల రూపాయలు.
  • బీసీలకు వైయస్సార్ కళ్యాణమస్తు కింద 50,000.
  • బీసీల కులాంతర వివాహాలకు 75,000.
  • మైనారిటీలకు షాదీ తోఫా కింద లక్ష రూపాయలు దివ్యాంగుల వివాహాలకు ₹1,50,000.
  • భవన నిర్మాణ కార్మికుల పెళ్లిళ్లకు 40 వేలు ఆర్థిక సాయం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.

వైఎస్ఆర్ కల్యాణమస్తు అర్హతలు:

అమ్మాయి వయసు 18 ఏళ్లు.
అబ్బాయి వయసు 21 ఏళ్లు కచ్చితంగా నిండాలి.
గ్రామాల్లో నెలసరి ఆదాయం 10000 పట్టణాల్లో నెలసరి ఆదాయం 12వేలకు మించకూడదు.
ఇక విద్యుత్ వాడకం 3 యూనిట్లు మించకూడదు.
ఆ కుటుంబంలో ఇన్కమ్ టాక్స్ పేర్లు ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగాలు ఉండకూడదు.

ఇక వైయస్సార్ కళ్యాణమస్తు పథకానికి సంబంధించి మరింత సమాచారం కావాలనుకునేవారు అప్లై చేసుకోదలచిన వారు మీ దగ్గరలోని గ్రామా అవార్డు సచివాల సిబ్బందిని సంప్రదించండి

Leave a Comment