ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఇందులో వైయస్సార్ బీమా పథకం కూడా ఒకటి ముఖ్యంగా దిగువ రేఖకు ఉన్న వారందరికీ వర్తించే విధంగా ఏపీ సర్కార్ వైయస్సార్ బీమా పథకాన్ని రూపొందించింది. అందరూ ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న ముఖ్య లక్ష్యంతో ఈ వైయస్సార్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం.
వైయస్సార్ బీమా
YSR Bima స్కీం జూలై 16 నుంచి కొత్తగా రెన్యువల్ చేసిన భీమా అమలు లోకి వస్తుంది. 15-07-2023 వరకు ప్రస్తుత బీమా వర్తిస్తుంది. జూలై 1 నుంచి జూలై 15 మధ్యలో రిజిస్టర్ అయినటువంటి క్లైమ్స్ ను Non Policy period Claims గా పరిగణిస్తారు. ఈ సమయంలో వచ్చే claims రిజిస్టర్ చేయుటకు సచివాలయం. వెల్ఫేర్ లాగిన్ లో “No Policy period Bima 2022-23” అప్షన్ ఇవ్వటం జరిగింది.
వైయస్సార్ బీమా పథకం బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక చేయూతతో పాటు ప్రభుత్వం అందించే ధీమా ఊహించని ప్రమాదం జరిగినప్పుడు రోజు కూలీలు అసంఘటిత వ్యక్తుల కుటుంబాలకు వైయస్సార్ బీమా పథకం ఒక ఆర్థిక చేయూత.ఈ స్కీం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల ప్రజలు ప్రయోజనం పొందుతారు.
YSR భీమా పథకం: బీమా కవరేజ్
- ఇక 18 నుంచి 50 సంవత్సరాల వయసు మధ్య అసహజ మరణం పొందిన వారికి లేదా శాశ్వత అంగవైకల్యానికి 5 లక్షల బీమా కవరేజ్ ఉంటుంది.
- ఇక 51 నుంచి 70 సంవత్సరాల వయసు వాళ్లకు అసహజ మరణం లేదా శాశ్వత వైకల్యానికి గురైతే మూడు లక్షల బీమా కవరేజ్ అవుతుంది.
- ఇక 18 నుంచి 50 సంవత్సరాల వయసు గల వారికి సహజమైన సందర్భంలో రెండు లక్షల రూపాయల బీమా లబ్ధిని చేకూరుతుంది.
- ఇక 18 నుంచి 70 సంవత్సరాల వయసు మధ్య గల వారికి ప్రమాదవ రిక్షా శాశ్వత పాక్షికవైకల్యం ఏర్పడితే వారికి 1,50,000 భీమా ప్రయోజనాలు అందుతాయి.
వైయస్సార్ బీమా నామిని
- లబ్ధిదారుల యొక్క భార్య
- 21 ఏళ్లు నిండిన కొడుకు
- పెళ్ళికాని కూతురు
- వితంతువు అయినా స్త్రీ కోడలు లేదా అన్న పిల్లలు
- వితంతువైన కూతురు
వైయస్సార్ బీమా పథకం అర్హతలు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులై ఉండాలి
- ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ గుర్తింపు కార్డు ఆదాయ ధ్రువీకరణ పత్రం
- నివాస ధ్రువీకరణ పత్రం
- బ్యాంక్ ఎకౌంట్ వివరాలు
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో
- మొబైల్ ఫోన్ నెంబర్
హెల్ప్ లైన్ నెంబర్
వైయస్సార్ బీమా పథకానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ప్రశ్నలు ఉంటే మీరు ఏపీ బీమా పథకం టోల్ ఫ్రీ నెంబర్ 155214 కి కాల్ చేయవచ్చు.