డ్వాక్రా మహిళలకు.! అకౌంట్లలోకి డబ్బులు పడ్డాయో లేదు ఇలా చెక్ చేసుకోండి

వైఎస్సార్‌ ఆసరా – ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా అక్కచెల్లెళ్లకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్త అందించారు వైయస్సార్ ఆసరా పథకం కింద ఈరోజు మహిళల ఖాతాలో నిధులు విడుదల చేసింది అనంతపురం జిల్లా ఉరవకొండలో వైయస్సార్ ఆసరా స్కీం కింద నాలుగో విడత రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల సభ్యుల మహిళల బ్యాంకు ఖాతాలోకి నేరుగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నగదు జమ చేశారు.

వైఎస్సార్‌ ఆసరా

2019 ఏప్రిల్ 11 నాటికి ఏపీ రాష్ట్రంలో 78,94,169 మంది పొదుపు మహిళల పేరుతో ఉన్న రుణాలను బ్యాంకుల్లో 25,570 80 కోట్లు అప్పులు ఉండగా ఇప్పటికే మూడు విడతల్లో వైయస్సార్ ఆసరా కింద 1917597 కోట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చెల్లించింది ఇక చిట్టచివరిగా మిగిలిన 6394. 83 కోట్ల మొత్తాన్ని 78 లక్షల మంది మహిళల బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. దీంతో వైయస్సార్ ఆసరా నాలుగో విడత పథకం కూడా పూర్తయింది వైయస్సార్ ఆసరా పథకం అర్హుల పేర్లను లబ్ధిదారుల జాబితాను ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శించారు.

ఒకవేళ ఏదైనా కారణం రీత్యా మీకు అనుమానాలు ఉన్న ఈ డబ్బులు మీకు ఖాతాలో పడకపోయినా దీనికి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా హెల్ప్ లైన్ నెంబర్ 0863-2347302 కాల్ చేయొచ్చు. లేదా ఈమెయిల్ supportmepma@apmepma.gov.in అనే మెయిల్ ఐడి ద్వారా తెలుసుకోవచ్చు.

ఇక వైయస్సార్ ఆసరా పథకానికి మీరు అర్హులు కావాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు అయి ఉండాలి. ఇక ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి నివాస రుజువు పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే మీరు కూడా వైయస్సార్ ఆసరా పథకాన్ని అర్హులు.

Leave a Comment