Ujjwala Yojana Scheme – ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి వార్త అందించింది. సార్వత్రిక ఎన్నికలవేళ కేంద్ర క్యాబినెట్ ఉజ్వల యోజన లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Ujjwala Scheme
వీరందరికీ ఒక్కో సిలిండర్ పై 300 రూపాయలు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం నేరుగా ఖాతాలో జమ చేస్తుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీం కింద 14.2 కిలోల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పై 300 రూపాయల సబ్సిడీ డబ్బులు మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు తాజాగా కేంద్రం ప్రకటించింది దీనికి సంబంధించి కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ గారు అధికారిక ప్రక్కన తెలిపారు. ఈ సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం ఖజానాపై ఏకంగా 12 వేల కోట్ల రూపాయల భారం పడుతుందని తెలిపారు.
LPG Gas Subsidy
ఇక (BPL) బిపిఎల్ రేషన్ కార్డు దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఈ ఉజ్వల యోజన స్కీం కింద గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్లో సబ్సిడీ మొత్తాన్ని 200 నుంచి 300 రూపాయలకు పెంచింది.
ఈ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది కుటుంబాలకు ఎంతో లబ్ధి చేకూరాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.ఇక 300 రూపాయలు గ్యాస్ సబ్సిడీ అనేది మనకి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి ఈ రాయితీని వర్తింపచేస్తారు. పీఎం యువై లబ్ధిదారులకు ఒక్కో సెంటర్ పై 300 సబ్సిడీ ఏడాదికి 12 గ్యాస్ కు అందించడం జరుగుతుంది