Free Darshan Tokens – తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం ఎప్పటికప్పుడు నూతన మార్గదర్శకాలు అనేక రూల్స్ ను మారుస్తూ భక్తుల సౌకర్యం కోసం నిత్యం కృషి చేస్తున్న టీటీడీ తాజాగా భక్తుల సూచనల మేరకు లక్కీ డిప్లో విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కేటాయింపును పరిశీలిస్తామని తాజాగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారు తెలిపారు. తాజాగా కాలంలో వేసవిలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేరా సర్వదర్శనం టోకెన్లు జారిని 30 వేల వరకు పెంచామని బ్రేక్ దర్శన సిఫార్సు లేఖలు రద్దు చేయడంతో పాటు రెండు గంటలు అదనంగా సామాన్య భక్తులకు దర్శనం కేటాయిస్తున్నామని తెలిపారు.
Free Darshan Tokens
తిరుమల తిరుపతి దేవస్థానం దేశవ్యాప్తంగా ఆధ్యాత్మికతను పెంపొందించే అనేక భక్తి కార్యక్రమాలు చేపట్టింది ఈ నేపథ్యంలో డైలీ యువర్ అనే ప్రోగ్రాం ద్వారా ఈవో కార్యక్రమంలో ధర్మారెడ్డి విశేషంగా భక్తులతో మాట్లాడారు. ఇక తిరుమల లో జరుగుతున్న అనేక సాంస్కృతిక కార్యక్రమాలుటీటీడీ చేపట్టిన సుందరాకాండ, భగవద్గీత, అయోధ్యకాండ, గరుడ పురాణం పారాయణం వంటి పలు ఆధ్యాత్మిక సంగీత భక్తి కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న భక్తులు ప్రశంసలు జల్లు కురిపించారు.
ఇక టీటీడీ భక్తులకు నిత్యం అందిస్తున్న అన్నదాన కార్యక్రమం వసతి దర్శనం తదితర సౌకర్యాలు అత్యద్భుతంగా ఉన్నాయి అని తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు భక్తులు విశేషంగా తెలిపారు.
శ్రీవాణి ట్రస్ట్ కింద ప్రతిరోజు 1500 నుంచి 160 టోకెన్లు ఆన్లైన్ ఆఫ్లైన్లో కేటాయిస్తున్నట్లు తెలిపారు అలాగే బ్రేక్ దర్శనాలు రోజుకు 200నుంచి 250 కేటాయిస్తున్నారు.
ఇక డిప్ ద్వారా భక్తులకు సామాన్య సేవ నుంచి కల్యాణోత్సవం అభిషేకం పలు విశేష సేవలకు డిప్ వేసే భక్తులకు సకాలంలో ఎస్ఎంఎస్లు మొబైల్ కు వచ్చేలా టెలికాం కంపెనీల సిగ్నల్ వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచనలు చేస్తామని తెలిపారు.