ఎంసీఎక్స్‌లో మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పెరిగింది.
Gold Price Today: బంగారం ధర మెరిసిపోయింది. బంగారం ధర పరుగులు పెట్టింది. బంగారం ధర పెరిగితే పసిడి బాటలోనే వెండి కూడా నడిచింది. ఇక అంతర్జాతీయ బుల్లియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి.
పసిడి ధర
భారత దేశంలో బంగారం సురక్షితమైన పెట్టుబడి మార్గంగా చూస్తారు.అందువల్ల ధంతేరాస్, దీపావళి, వంటి పండుగ సందర్భాల్లో బంగారం కొనడానికి ఎక్కువ మంది ఆసక్తిచూపుతారు. నవంబర్ 13న దేశమంతా ధంతేరాస్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకోబోతోంది. ధంతేరస్ సమయంలో నగల షాపులు కిటకిటలాడుతుంటాయి.
స్త్రీలు పసిడి నగలు ఎక్కువగా కొంటారు.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.51,930కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.350 పైకి కదిలింది. దీంతో ధర రూ.47,600కు ఎగసింది. కేజీ వెండి ధర రూ.300 పెరిగింది. దీంతో వెండి ధర రూ.66,600కు చేరింది. బంగారం ధర ఔన్స్‌కు 0.24 శాతం పెరుగుదలతో 1942 డాలర్లకు చేరింది.
బంగారంలో భారీగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు మారుతున్న అంతర్జాతీయ తాజా పరిస్థితులు క్షుణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని అనలిస్టులు సూచించారు.
చిన్న మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు వారి అవసరాలను దృష్ట్యా వ్యవహరించడం మంచిదన్నారు.
బంగారం ధర పెరుగుతోందంటే పేద మధ్యతరగతి ప్రజల్లో ఆందోళన మొదలవుతుంది. పిల్లల వివాహాలు, ఇతర శుభకార్యాల వంటి అవసరాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ఈ పరిస్థితుల్లో కాస్తంత వేగంగా నిర్ణయం తీసుకోవాలని చూస్తారు.
బంగారం వినియోగంలో భారత్ దేశంతో పాటు చైనా కూడా ముందంజ లో ఉంది.