రేషన్ కార్డు స్టేటస్ | తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఎట్టకేలకు జోరుగా సాగుతోంది.రాష్ట్రంలో మొత్తం 3లక్షల 9వేల 83 కార్డులను ప్రభుత్వం కొత్తగా జారీ చేసింది.
రేషన్ కార్డు స్టేటస్
తెలంగాణ రేషన్ కార్డు హైదరాబాద్ బేగంపేటలోని జురాస్టియన్ క్లబ్‌లో నూతన రేషన్ కార్డులను లబ్దిదారులకు అందజేశారు మంత్రి తలసాని శ్రీనివాస్. ఆగస్టు నెల నుంచే కొత్త కార్డు దారులందరికీ రేషన్ సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.ప్రతి కుటుంబంలో ఒక్కరికి 6 కేజీల చొప్పున రేషన్ బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం.
ఒక వేళ మీరు మీసేవాలో రేషన్ కార్డు దరఖాస్తు చేసుకుంటే ఆ సమయంలో వారికి ఒక Reference No అనేది కేటాయిస్తారు. దాని ద్వారా రేషన్ కార్డు మంజూరు అయ్యిందా లేదా తిరస్కరించారా అనే విషయం తెలుస్తుంది.
అందులో National food security card వెబ్ సైట్ కి వెళ్లి
->రేషన్ కార్డు దరఖాస్తు ఇలా తెలుసుకోండి ముందుగా https://epds.telangana.gov.in/FoodSecurityAct క్లిక్ చేయండి.
->రిపోర్ట్ అనే ఆప్షన్ ఎంచుకోండి తరువాత Ration Card కేటగిరీలో FSC కార్డు స్టేటస్ రిపోర్ట్ పై క్లిక్ చేయండి.
->తర్వాత పేజీ లో మీ జిల్లా మండలం రేషన్ షాప్ వివరాలు ఉంటాయి.
->అక్కడ రిఫరెన్స్ నెంబర్/ పేరు /హౌస్ నెంబర్ టైప్ చేయాలి రేషన్ కార్డు మంజూరు అయితే కార్డు హోల్డర్ పేరు కనబడుతుంది.