Sukanya Samriddhi Scheme – కేంద్ర ప్రభుత్వం మహిళలకు అనేక రకాల పథకాలు ప్రవేశపెడుతుంది అందులో ముఖ్యమైనది ఆడపిల్లలకు సంబంధించి సుకన్య సమృద్ధి యోజన సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది చాలా చిన్న మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసే వారికి ఇది మంచి స్కీం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాల్లో ఇది కూడా ఒకటి ఆడపిల్లలకు ఆర్థిక చేయూతను అందించే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
సుకన్య సమృద్ధి
ఇందులో ఆడపిల్లలు 14 ఏళ్ల వయసు వచ్చేసరికి డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక ఆ ఎకౌంటు హోండర్కు 18 ఏళ్ల వచ్చేసరికి మెచ్యూరిటీ అమౌంట్ లో 50% వరకు డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది ఇక 21 ఏళ్లు వయసు వచ్చేసరికి మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ అయితే చేతికి అందుతుంది అయితే అనేక స్మాల్ సేవింగ్ స్కీం లో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ముఖ్యమైందిగా చెప్పొచ్చు.
సుకన్య సమృద్ధి కేవలం ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.ప్రతి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలకు ఈ స్కీం లో చేరే అవకాశం ఉంటుంది.తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందే సువర్ణ అవకాశం సుకన్య సమృద్ధి స్కీం,ఇక ఈ స్కీం ద్వారా గరిష్టంగా 8 శాతంగా వడ్డీ రేటు లభిస్తుంది. ప్రతి నెలలు ఒకసారి చెల్లిస్తుంది. ఇక ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి ఇటీవల చిన్న పొదుపు పథకాలకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచేసింది.
Sukanya Samriddhi Scheme
ఇది వరకు 7.60 శాతంగా ఉన్న వడ్డీ ఏకంగా 40 బేసిస్ పాయింట్ల మేర పెరిగి 8 శాతానికి పెరిగింది.ఈ స్కీం చేరాలంటే మీ దగ్గర్లోని బ్యాంక్ లేదా పోస్టాఫీస్ లో ఈ ఖాతా తెరవొచ్చు. రూ. 250తో అకౌంట్ ఓపెన్ అవుతుంది.సుకన్య సమృద్ధి స్కీం ద్వారా లబ్ధిదారులు ఇన్కమ్ టాక్స్ (IT) ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80(C) కింద పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు.