రైతుబంధు నిధులు,రైతుబంధు కోసం ప్రత్యేక కాల్ సెంటర్
తెలంగాణ రైతులకు పండగలాంటి వార్త. తెలంగాణ రాష్ట్ర రైతుల కలల పథకమైనా రైతు బంధు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించింది. వానాకాలం సాగుకు పంట పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకాన్ని ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విధి విధానాలను రూపొందించి తాజాగా ప్రకటించింది.యాసంగి పంట పెట్టుబడి సాయంగా రైతు బంధు పథకానికి సంబంధించిన పూర్తి నిధులను ఆర్థిక శాఖ సర్దుబాటు చేసి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.
రైతుబంధు
ఒకేసారి నిధులు సమకూర్చే వీళ్లు లేకపోవడంతో గత ఏడాదిలాగే ఈ సారి కూడా విడతలవారీగా రైతులకు రైతుబంధు పథకం అమలుకానుంది ఇందులో భాగంగా మొదటి రోజు ఒక ఎకరం ఉన్నవారికి రెండో రోజు రెండు ఎక్కడ ఉన్న వాళ్లకి మూడో రోజు మూడు ఎకరాలు ఉన్నవారికి ఇలా ఐదు వేల ఐదు వందలు చొప్పున రైతు బంధు నిధులు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి రైతు బంధు పథకానికి అర్హులు సంఖ్య గణనీయంగా పెరిగింది.
రైతుబంధు నిధులు
కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందినవారు తాజాగా పొలం క్రయవిక్రయాలు జరిపిన వారికి సైతం రైతుబంధు పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు అనుగుణంగా దీనికి తగ్గట్టు మార్గదర్శకాలను జారీ చేసింది.
కాగా లబ్ధిదారుల జాబితాను వ్యవసాయ శాఖకు అందించాలని ccla ను రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అలాగే వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. ఇక ఈ రోజు రేపు రైతు బంధు పూర్తి జాబితా వ్యవసాయ శాఖకు అందే అవకాశం ఉంది.
ఈ ఏడాది 2022 వార్షిక బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ కోసం 15 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించిన ఇందులో వానాకాలం సీజన్‌కు సంబంధించి రూ.7,500/- కోట్లు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు రైతు బంధు పథకం కింద సుమారు 25 లక్షల మంది రైతులకు అవకాశాలు ఉన్నాయి.