prajapalana – తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. ఎక్కడికక్కడ మండల కేంద్రాలలో దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తులు యొక్క డేటాను ఆన్లైన్ చేస్తున్నారు.ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒక కోటి 25 లక్షల పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రజాపాలన (Prajapalana) దరఖాస్తు
ప్రజాపాలన (Prajapalana) సదస్సు ద్వారా డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు అభయహస్తం (Abhaya Hastham) దరఖాస్తులు స్వీకరించరు.ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకంతోపాటు రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు ప్రజల నుంచి అభయహస్తం దరఖాస్తులను స్వీకరించింది.
Prajapalana official website link:-https://prajapalana.telangana.gov.in/
తెలంగాణ లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్.అన్నిటికి అభయహస్తం (Abhaya Hastham) దరఖాస్తులు ప్రామాణికంగా తీసుకుంది.ఈ దరఖాస్తులు పరిశీలించి డేటా ఎంట్రీ పూర్తి చేసి.అర్హుల జాబితా విడుదల చేస్తారు.అభయహస్తం (Abhaya Hastham) దరఖాస్తులు జిరాక్స్ సెంటర్ల యజమానులు ఒక్కో దరఖాస్తు ఫారం జిరాక్స్ తీసేంకు రూ.30 నుంచి రూ.100 వరకు కూడా వసూలు చేస్తున్నారు.ప్రతి నాలుగు నెలలు ఒకసారి ఈ Abhaya Hastham) దరఖాస్తులు పరిశీలిస్తారు.