దేశవ్యాప్తంగా రైతులందరూ పీఎం కిసాన్ 14వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూపులు చూస్తున్నారు అయితే పీఎం కిసాన్ సంబంధించి యోజన స్కీం పై కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది at pmkisan.gov.in.
పీఎం కిసాన్ 14వ విడత
14వ విడత పిఎం కిసాన్ నిధులు మనకి ఏప్రిల్ జూలై లోపే రైతులు ఖాతాలోకి పడాల్సి ఉంది అయితే కొన్ని కారణాల రీత్యా ఇది కాస్త ఆలస్యమైంది తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం 14 విడత పిఎం కిసాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులను ఈనెల అంటే జులై 28వ తేదీన డిబిటి ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ చేయమన్నారు.
ఈ సారి భారతదేశంలో దాదాపు తొమ్మిది కోట్ల మంది రైతులకు పిఎం కిసాన్ సంబంధించిన పథకం 14 విడత డబ్బులు అందజేయనున్నారు దీనికి తోడు తాజాగా కేంద్రం రైతులకు ఎరువులకు సంబంధించిన సబ్సిడీ కూడా ప్రకటించింది.పీఎం కిసాన్ సమ్మాన్ పథకం ప్రతిసంవత్సరంలో, మొదటి విడత ఏప్రిల్ నుంచి జులై వరకు, రెండవ విడత ఆగస్టు నుంచి నవంబర్ వరకు, మూడవ విడత డిసెంబర్ నుంచి మార్చి వరకు అందిస్తుంటారు.
ఇక పీఎం కిసాన్ సంబంధించిన పథకంలో కేంద్ర ప్రభుత్వం అనర్హులు ఏరువేతకు రంగం సిద్ధం చేసింది ఇదేకాక ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తిగా చేసి ఉంటారు వారికి మాత్రమే ఖాతాలో డబ్బులు జమకాలున్నాయి బయోమెట్రిక్ ఐరిష్ అలాగే ఆధార్ బ్యాంకు అకౌంట్ లింక్ అయిన వారికి మాత్రమే ఖాతాలో 2000 రూపాయలు జమ చేయనున్నారు.