వైఎస్సార్ జగనన్న శాశ్వత భూములు, ఆస్తుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకంలో భాగంగా
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు
భూ లావాదేవీలు ఇక పై సులభతరం, వివాద రహితం…. ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూ హక్కుపత్రం…
- 123 పట్టణ ప్రాంతాలలో షుమారు 50 లక్షల స్థిరాస్తులను రీ సర్వే చేసి 2023 జూలై నాటికి హక్కు పత్రం మంజూరు చేయబడును.
- 100 సంవత్సరాలు తరువాత దేశంలో ఏ రాష్ట్రములో జరగనట్లు ప్రజల యొక్క భూముల మరియు ఆస్తుల యొక్క రక్షణ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న మహాయజ్ఞం
- రెవిన్యూ, సర్వే భూ రికార్డుల శాఖ మరియు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ వారి సంయుక్త భాగస్వామ్యముతో భూముల సమగ్ర రీ సర్వే.
- ప్రతి ఆస్తికి ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత హక్కుపత్రం ఇవ్వటం.
రికార్డులు:
సర్వే మరియు రెవిన్యూ రికార్డుల వివరాలు డిజిటల్ రూపంలో…
1.భూ కమత పఠం,
2. పట్టణ సర్వే పఠం
3. రీసర్వే ల్యాండ్ రిజిష్టర్
4. 1బి రిజిష్టర్,
5. శాశ్వత భూ హక్కు పత్రం
సర్వే విధానం:
- వార్డు సభల ద్వారా సర్వే విధి విధానం, షెడ్యూలు ప్రయోజనాల వివరణ,
- వార్డు సచివాలయ డబ్ల్యు పి.ఆర్.ఎస్.తో సర్వే నిర్వహణకు సర్వే బృందాల ఏర్పాటు
- డ్రోన్, కార్స్ నెట్వర్క్, రోవర్ వంటి ఆధునిక పరికరాల ద్వారా ప్రతి స్థిరాస్తినీ అత్యంత ఖచ్చితంగా భూ అక్షాంస, రేఖాంశాలతో గుర్తించి కొత్త సర్వే మరియు రెవిన్యూ రికార్డులను తయారు చేయబడతాయి.
- ప్రతి యజమానికి పై రికార్డులను U/s 9(2) నోటీసు ద్వారా తెలియపరుస్తాము.
- ఏదైన అభ్యంతరాలు ఉంటే వార్డు సర్వే బృందాల ద్వారా అప్పీలు చేసుకొను సౌకర్యం కలదు.
- ఈ అప్పీలును పరిచడాని మున్సిపల్ స్థాయిలో మొబైల్ మెజిస్ట్రేట్ బృందములను ఏర్పాటు చేయడం జరిగింది.
- సర్వే పూర్తి అయిన ప్రతి ఆస్తికి శాశ్వత భూ హక్కు పత్రం ఇవ్వబడుతుంది.
- సర్వే మరియు రెవిన్యూ రికార్డులు, ఆస్తుల వివరములు ఇక డిజిటల్ రూపములో కూడా మీ వార్డు సచివాలయములో అందుబాటులో ఉంటాయి.
ఉపయోగాలు:
- మీ భూమిని మీ సమక్షములోనే సర్వే చేసి, ఖచ్చితమైన కొలతలు వేసి చూపించబడును.
- ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూమి హక్కుపత్రం ఇవ్వబడును.
- ల్యాండ్ పార్శిల్ మ్యాప్లు (LPM / PPM) ఇవ్వబడును.
- మీ భూమి విశిష్ట గుర్తింపు నెంబరు ఇవ్వబడుతుంది. (ఐ.డి)
- అభ్యంతరాలు పరిష్కరించడానికి మున్సిపల్ స్థాయిలో మొబైల్ మెజిస్ట్రేట్ టీమ్ వారు ఉంటారు.
- శాశ్వత హక్కు మరియు ఖచితమైన రికార్డులు తయారగును.
- వార్డు ప్రకారం ల్యాండ్ పార్శిల్ మ్యాప్లు తయారు చేయబడును.
- దళారీ వ్యవస్థకు మంగళం.
- భూ యజమానులు ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదు.
- మీ సమక్షములోనే సర్వే చేసి క్రొత్త రికార్డులు తయారుచేసి శాశ్వత భూహక్కు పత్రం ఇవ్వబడును.
- ఈ శాశ్వత భూహక్కు వేరొకరు సవాలు చేయడానికి వీలుండదు.