రాత్రి పూట రైల్వే ప్రయాణికులకు? కొత్త రూల్స్ ఏంటో తప్పక తెలుసుకోండి

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.! భారతదేశంలో అందరి బండిగా పేరుగాంచిన రైల్వే ప్రయాణం అంటే ప్రజలకు మక్కువ ఎక్కువ. దేశ ప్రజలు ఎక్కువగా వినియోగించే రవాణా సాధనం ట్రైన్ ఇది దేశానికి జీవనాడిగా ఉంటుంది.

అయితే రైళ్లలో రాత్రిపూట ప్రయాణాలు కాస్త విసుగు పుట్టిస్తుంది. భద్రతా దృష్ట్యా దొంగతనాలు పెద్దగా మాట్లాడుకోవడం వంటి కారణాలతో నిద్ర లేకపోవడం వంటి ఎన్నో విషయాల్లో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాంటి ఇబ్బందుల నుంచి రైల్వే ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు వారి ప్రయాణం సాఫీగా సాగేలా చేయడానికి ఐఆర్సిటిసి(IRCTC) కొత్త మార్గదర్శకాలను రూపొందించింది.

రైల్వే కొత్త మార్గదర్శకాలు

  • ఇక రైల్వే ప్రవేశపెట్టిన కొత్త మార్గదర్శకాల ప్రకారం ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ (TTE) రాత్రి 10:00 దాటిన తర్వాత టికెట్లను చెక్ చేయడానికి కుదరదు.
  • ఇక పొరపాటున ఎవరైనా వారు ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అయితే ఒక గంట తరువాత లేదా రెండు రైల్వేస్టేషన్లో దాటిన తర్వాత గాని ఈ సీట్లను ఇతర ప్రయాణికులకు టీటీఈ కేటాయించవచ్చు.
  • రాత్రి పది దాటిన తరువాత మిడిల్ బెర్త్ ప్యాసింజర్ ఎవరైతే ఉంటారో వారు ఉదయం 6 గంటల వరకు తమ భర్తలో పడుకోవచ్చు.
  • ఇక రైళ్లలో ప్రయాణించేటప్పుడు కంపార్ట్మెంట్లో లేదా కోచ్ లో పెద్ద పెద్ద శబ్దాలతో ఫోన్లో మాట్లాడడానికి వీలు లేదు అలాగే ఎలక్ట్రానిక్ డివైస్లతో పాటలు కూడా వినకూడదు ఈ రూల్స్ ను ఇతర ప్రయాణికుల సౌకర్యర్థం మరియు సీనియర్ సిటిజెన్ల ఇబ్బంది పడకూడదనే ముఖ్య ఉద్దేశంతో రైల్వే ఈ కొత్త రూల్స్ ను అమలు చేస్తున్నారు.
  • మరికొందరు ప్రయాణికులు రాత్రి 10:00 దాటిన తర్వాత కూడా ఉద్దేశంగా లైట్లు వేసి ఉంచుతున్నారని కోర్చిలలో ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు వీటిని దృష్టిలో ఉంచుకున్న రైల్వే రాత్రి 10 దాటిన తర్వాత లైట్స్ను ఆఫ్ చేసేలా మార్గదర్శకాలను రూపొందించింది.

ఈ సరికొత్త రూల్స్ ను ప్రయాణికులు పాటించకపోతే వారికి చర్యలు తప్పవు. మీరు రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఈ రూల్స్ ఎవరైనా అతిక్రమిస్తే మీరు డ్యూటీలో ఉన్న రైల్వే స్టాఫ్ లేదా ఎంప్లాయిస్ కు దీనిపై ఫిర్యాదు చేయవచ్చు.

మరి రైల్వే ప్రవేశపెట్టిన కొత్త రూల్స్ ఫై మీరు ఏమంకుంటున్నారు కింద మీ అభిప్రాయాలు చెప్పండి.

Leave a Comment