తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనదైన మార్కు పాలనతో తెలంగాణలో పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు మరో కీలక ప్రకటన చేసి సెన్సేషన్ గా నిలిచారు ఇక తండావాసులకు సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్త తెలిపారు బంజారా భవన్ లో సంత్ శ్రీ సేవాలాల్ 285 జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బంజారా సోదరులు కలవడం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్నంత సంతోషంగా ఉందని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా గతంలో 1976 సంవత్సరంలో ఇందిరమ్మ గారు బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఇక బంజారాల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కొనియాడారు దీనికి ప్రతిఫలంగా బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
శ్రీ సేవాలాల్
అయితే సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపేందుకు రెండు కోట్లు విడుదల చేస్తున్నామని ఈ వేదికపైనే ప్రకటించారు దీనికి సంబంధించి తక్షణమే జీవోను మంజూరు చేయాలని రాష్ట్ర ఉన్నత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు.అన్ని రంగాల్లో తండాలకు సమానమైన న్యాయం చేస్తామని గ్రామపంచాయతీలుగా మారిన అన్ని తండాలకు బీటి రోడ్లు వేస్తామని గ్రామ పంచాయతీలుగా మారిన తాండాల పంచాయతీకి భవనాలు అలాగే కరెంటు తాగునీరు ఇలా ఏ సమస్య ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అన్ని రకాలుగా ప్రభుత్వం వీరికి అండగా కృషి చేస్తుందని మాట ఇచ్చారు.
ఇక రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎస్టీ, ఎస్సీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో అన్ని వస్తువులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సంత్ సేవాలాల్ మార్గంలో అందరూ నడవండి అని రేవంత్ రెడ్డి గారు ఈ మేరకు పిలుపునిచ్చారు.