తెలంగాణ ఎన్నికల 2023 మేనిఫెస్టో -ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది.దింతో పార్టీలు అన్ని మేనిఫెస్టోను రూపొందించే పని నిమగ్నమయ్యారు.ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కళ్ళు తిరిగే మేనిఫెస్టోను తీసుకొచ్చింది.

బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా అదిరిపోయే కొత్త మేనిఫెస్టోను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేశారు.ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈసారి సార్ సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా ఉండబోతున్నాయని అనేక సర్వేలు తెలుపుతున్నాయి. దీంతో బి.ఆర్.ఎస్ పార్టీ సామాన్యుని దృష్టిలో పెట్టుకొని తాజాగా మేనిఫెస్టోను రూపొందించింది.

బీఆర్‌ఎస్‌ ప్రధాన పార్టీ తాజాగా ఏర్పాటు చేసిన మీడియా పాయింట్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ గారు విడుదల చేశారు ఇప్పటికే తెలంగాణలో రెండుసార్లు విజయం సాధించి అధికారం చేపట్టిన కార్ హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాల మేనిఫెస్టోను తయారు చేశారు.

ఇక దేశంలో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలను సరిచూసుకొని సాధ్యాసాధ్యాలను పరిశీలించుకున్న తర్వాత టిఆర్ఎస్ పార్టీ తాజాగా 2023 మేనిఫెస్టోను తెలంగాణ ప్రజల ముందు ప్రవేశపెట్టింది.తాజాగా చెప్పిన హామీలను అధికారంలోకి వచ్చే ఆరునెలల్లో తూచా తప్పకుండ అమలు చేస్తామన్నారు కేసీఆర్.

బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ముఖ్య అంశాలు

  • ప్రజలందరికీ ఐదు లక్షలు బీమా
  • ఆసరా పెన్షన్ 5000 కు పెంపు
  • రైతుబంధు సాయాన్ని 16 వేలకు
  • రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ.
  • తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ఈ బీమా సౌకర్యం అందబోతోంది.
  • ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ రాయితీ
  • దళిత బంధు కొనసాగింపు

Leave a Comment