ఆంధ్రప్రదేశ్లో లో ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ఉపాధ్యాయుల అర్హత పరీక్ష అయిన AP TET 2022 సంబంధించి తాజాగా ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఎవరైతే దరఖాస్తుదారులు జూన్ 15 నుంచి జూలై 15 వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చు. ఆగస్టు ఆరో తేదీ నుంచి 21 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు ఆగస్టు 31న సంబంధించిన కీ విడుదల చేసి సెప్టెంబర్ 14న ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.
AP TET 2022
అభ్యర్థులకు సలహాలు సూచనల కోసం జూన్ 13వ తేదీ నుంచి విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేస్తున్నారు జులై 26వ తేదీ నుంచి ఆన్లైన్లో అభ్యర్థులకు నిర్వహిస్తారు జూలై 25 వ తేదీ నుంచి హాల్ టికెట్లు జారీ చేస్తారు ఇక అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు ఒకసారి ఆస్కారం ఉండదు. అందువల్ల అభ్యర్థులు దరఖాస్తు నింపిన తర్వాత అన్ని వివరాలు ఒకటికి రెండు సార్లు సరిచూసుకుని సబ్మిట్ చెయ్యాలి.
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉపాధ్యాయులు టీచర్లు కావాలనుకొనే అభ్యర్థుల నుంచి ప్రభుత్వం జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపాలిటీ ప్రైవేట్ పాఠశాలలు మొదలైన వాటి కోసం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు టీచర్ల నియామకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు
యూజీడీపీఈడీ/ డీపీఈడీ/బీఈడీ/B.ED డిఎల్ఈడి లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమాన అర్హత లు అభ్యర్థులు ఈ టెట్కు అర్హులు.పరీక్ష ఫీజు: రూ.500
ఏపీ టెట్ పరీక్షా తేదీలు
పరీక్ష తేదీలు: 6 8 2022 నుంచి 20 18 2022 వరకు
పరీక్ష టైమింగ్స్ 9.30 am to 12.00 noon 2:30 hours
ఉదయం I(A),II(A), సాయంత్రం I(B) II(B) పరీక్షలు జరగనున్నాయి.
ఇక టెట్ పరీక్షలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ప్రముఖ నగరాలైన హైదరాబాద్ చెన్నై బెంగుళూరు లో నిర్వహిస్తారు అభ్యర్థులు వీటిని గమనించగలరు.