ఎడతెరిపి లేని జోరు వర్షాలతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు తడిచి ముద్దవుదున్నాయి.వర్షాలను చూస్తుంటే.. ఆకాశానికి చిల్లు పడినట్లే అనిపిస్తోంది.నైరుతి రుతుపవనాలు తోడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. రాష్ట్రంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి.
బంగాళాఖాతంలో 28న మరో అల్పపీడనం
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల లో వానలు దంచి కొడుతున్నాయి రాను రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు
దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీ లో ఉత్తరాది జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.తాజాగా తెలంగాణలో ఇంకో మూడు జిల్లాలను రెడ్ అలర్ట్ చేర్చారు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ దగ్గర వరద ప్రవాహం అధికంగా ఉంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు బ్యారేజీ 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 533.60 అడుగులకు చేరింది.
అటు ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే గోదావరి ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు గ్రామాలు పూర్తిగా జలమయం అయ్యాయి. తీరం వెంట 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆగస్టు 3వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి వానలు కురుస్తాయని ఐఎండీ ఒక ప్రకటనలో తెలిపింది.