గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,253 పోస్టులకు త్వరలోనోటిఫికేషన్.!

ఏపీలో నిరుద్యోగులకు జగన్ సర్కార్ మరో తీపిక అభివృద్ధి తెలిపింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అనేక సేవలు అందిస్తున్న గ్రామ వార్డు సచివాలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ జారీచేనుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రూపొందించి పోస్టుల భర్తీకి అధికారిక ప్రకటన వెలువరించనుంది.

సచివాలయ పోస్టులు

మొత్తం 20 కేటగిరీలో సుమారు 14,523 పోస్టును భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏప్రిల్ లో రాత పరీక్షలు నిర్వహించే యోజనలో అధికారులు ఉన్నట్లు సమాచారం.

ఈసారి కూడా పరీక్షలను పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే ఈ ప్రక్రియను చేపడతారు ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని గ్రామ వార్డు సచివాలయ శాఖ గత సోమవారం పంచాయతీరాజ్ శాఖకు ఉత్తర్వులు కూడా రాసింది. ఏ శాఖలో ఎన్ని పోస్ట్లు ఉన్నాయని వివరాలను కూడా ఆ లేఖలో పేర్కొంది. ముఖ్యంగా రెవెన్యూ వ్యవసాయ పశుసంవర్ధక మున్సిపల్ ఉద్యానవన ఫిషరీస్ ఆరోగ్య వైద్య హోంశాఖల పర్యవేక్షణలో అనేక ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ముఖ్యంగా పశుసంవర్ధక శాఖలో 4765 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలాగే విలేజ్ సర్వే అసిస్టెంట్ లో 900 పోస్టులు ఇంజనీరింగ్ అసిస్టెంట్ లో 982 పోస్టులు హార్టికల్చర్ అసిస్టెంట్ లో 1005 పోస్టులు భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువరించనుంది. ఇక ఈ నోటిఫికేషన్ ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టి ఉద్యోగాల నియామక ప్రక్రియను సైతం పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా గ్రామ వార్డు సచివాలయంలో వేలాది మందికి ఉపాధి లభించనుంది.

Leave a Comment