E KYC – ఈ-కేవైసీ గడువు పొడిగింపు – ఏపీ రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్

ఈ-కేవైసీ | AP E KYC ప్రజల సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకొంది.

ఈ-కేవైసీ

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చుసిన రేషన్ కార్డులకు ఈ-కేవైసీ కోసం జనాలు ఆధార్ సెంటర్లకు క్యూ కట్టారు. ఏపీలో ఇక పై ఎలాంటి సంక్షేమ పథకాలు (AP Welfare Schemes) రావాలన్న.. రేషన్ బియ్యం సరుకులు తీసుకోవాలన్నా తప్పకుండా ఈ కేవైసీ (E kyc) పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ గడువు సమయం పూర్తి అయినా నేపథ్యంలో ప్రజలకు ఊరట కలిగే నిర్ణయం తీసుకోండి ఆంధ్ర ప్రదేశ్ సర్కార్.

ఏపీ ఈ–కేవైసీ

కరోనా దృష్ట్యా ఆధార్ కేంద్రాలతో పాటు ఈ-కేవైసీ నమోదు కేంద్రాలు పనిచేయకపోవడం లాంటి పలు కారణాలతో
స్పందించిన ప్రభుత్వం ఈ-కేవైసీ నమోదుకు గడువును ఈ నెల సెప్టెంబర్ 15 వరకూ పొడిగించింది. ఈ-కేవైసీ నమోదు చేయించుకునేందుకు లబ్దిదారులకు అవకాశం కల్పించింది.

ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ కోన శశిధర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం ఇబ్బంది పడకూడదనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు శశిధర్ తెలిపారు.

Leave a Comment