దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో అన్ని పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించనున్న ప్రవేశ పరీక్షల తేదీలను తాజాగా ప్రభుత్వం ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది.జులై 27 నుంచి 31 వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది.
ఉన్నత విద్యామండలి ప్రకటించిన పరీక్ష తేదీలు:
జూలై 27 -31 వరకు ఎంసెట్ పరీక్షలు
ఈసెట్ జూలై 24
ఐ సెట్ జూలై 25
పీజీ సెట్ ఆగస్టు 2 నుంచి 4 వరకు
ఎడ్ సెట్ ఆగస్టు 5
లా సెట్ ఆగస్ట్ 6
ఈసెట్ ఆగస్ట్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు.
ఈ పరీక్షలకు సంబంధించి ఉన్నత విద్యా మండలి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: