ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుంది. ఇక పేద విద్యార్థుల కోసం ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు సరికొత్త పథకాన్ని అందిస్తున్నారు. ఈ పథకం పేరు జగనన్న వసతి దీవెన.నవరత్నాలు పథకాల లో ఇది కూడా ఒకటి.
జగనన్న వసతి దీవెన
ఈ పథకం ద్వారా ప్రభుత్వం భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఏడాది రెండు వాయిదాల్లో. పాలిటెక్నిక్ ఐటిఐ డిగ్రీ చదివే వారికి 20,000 వేల రూపాయల వరకు వసతి రవాణా ఖర్చుల కోసం విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తుంది.
వసతి దీవెన పథకం అర్హులు
ఐటీఐ,పాలిటెక్నిక్,డిగ్రీ చదువులు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, యూనివర్శిటీలు, బోర్డుల్లో చదివేవారు అర్హులు. వసతి దీవెన పథకం పొందాలంటే విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి.డే స్కాలర్, కాలేజ్ హాస్టల్స్, ఉండే విద్యార్థులకు సైతం అవకాశం ఉంది.
వసతి దీవెన స్కీం విద్యార్థులకు సీఎం జగన్ ప్రభుత్వం ఒక ఆశ కిరణం ఉన్నత చదువులను అభ్యసించే సామాన్య,పేద పిల్లలకు సీఎం జగన్ మామ అపురూప బహుమతి.ఏపీ ప్రభుత్వం ప్రతి ఏడాది 2 సార్లు విద్యార్థులకు సాయాన్ని అందిస్తుంది. ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఏడాదికి రూ.10,000/-వేలు.. పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15,000/-వేలు.. మిగిలిన విద్యార్థులు (డిగ్రీ, పీజీ)కు రూ.20వేలు అందజేస్తారు.
ఈ పథకం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ,బీసీ, కాపు, ఈబీసీ, అంగవైకల్యం ఉన్న విద్యార్థులు కూడా ఈ వసతి దీవెన పథకానికి అర్హులు.
జగనన్న వసతి దీవెన పేమెంట్ స్టేటస్
వసతి దీవెన పథకానికి సంబంధించి డబ్బులు పడ్డాయో? లేదాఅని తెలుసుకోవడానికి https://cfms.ap.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లి సిటిజన్ సర్వీసెస్‌లోకి వెళ్లాలి. అక్కడ బిల్ స్టేటస్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.