మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఖాతా ఉందా అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. ఎస్బిఐ ఖాతాదారులకు ముఖ్య గమనిక దేశ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బిఐ ఖాతాదారులకు ఆధార్ కార్డు పాన్ కార్డు అనుసంధానం చేసుకోవాలని తెలిపింది లేదంటే మీరు బ్యాంకులు నిర్వహించే లావాదేవీలపై ప్రభావం పడుతుందని తెలిపింది.
ఎస్బీఐ పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్
స్టేట్ బ్యాంక్ లో ఖాతా ఉన్న వారు వారి పాన్ కార్డు నెంబర్ ను ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన ఖాతాదారులకు కోరింది. ఇక మార్చి 31వ తేదీ కల్లా ఈ పని పూర్తి చేసుకోవాలని కస్టమర్లకు తెలిపింది ఒకవేళ పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేసుకోకపోతే బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలగవచ్చని తెలిపింది దీనికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ గా ట్విట్టర్ వేదికగా ఈ విషయం వెల్లడించింది.
ఇదిలా ఉంటే ఎస్బిఐ రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరి 15 నుంచి కొత్తగా పెంచిన వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చింది మీరు కనీసం వంద రూపాయలు డబ్బులు డిపాజిట్ చేయడం ద్వారా ఎస్బిఐ ఆర్డిఓ ఎకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
ఇక ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ తప్పనిసరి అని తెలిపిన ఎస్బిఐ పాన్ కార్డు ఆధార్ కార్డు వివరాలు ఒకేలా ఉండాలని పుట్టిన తేదీ వివరాలు గ్రూప్స్ ఉండాలని తెలిపింది కాగా మార్చి 31 2022 తో ఆధార్ లింక్ గడువు ముగుస్తుంది. ఈ విషయాన్ని ఖాతాదారులు గమనించి వీలైనంత త్వరగా పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలని ఖాతాదారులకు సూచించింది.
ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చెయ్యడం ఎలా?
పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడం చాలా సులభం. దీని కోసం మీరు ఆదాయపు పన్ను శాఖ ఆఫీసియల్ వెబ్‌సైట్‌కు వెళ్లాల్సి ఉంటుంది.