YSR EBC Nestham Scheme – వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం డబ్బులు అకౌంట్‌లో పడ్డాయా? లేదా తెలుసుకోండి

YSR EBC Nestham: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో సరికొత్త పథకానికి శ్రీకారం ఛుటింది. ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ పేరుతో ఎన్నికల హామీలలో మేనిఫేస్టోలో చెప్పకపోయినప్పటికీ ఈ పేద అక్కచెల్లెమ్మలకు ఆర్థిక భరోసా అందించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గారు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం

అగ్రవర్ణా పేద మహిళలకూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తుంది.ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, వెలమ, కులాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులు.వైఎస్సర్‌ ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ఏడాదికి 15,000/- రూ. చొప్పున మూడేళ్లలో మొత్తం రూ. 45,000 వేల ఆర్థిక సాయం అందించనుంది. 45-60 ఏళ్ల వయస్సు మహిళలకు ఈ స్కీం అమలు చేస్తారు.

ఇప్పటికే ఏపీ లో సంక్షేమానికి పెద్ద పిటా వేస్తున్న ప్రభుత్వం వైఎస్సర్‌ సున్నా వడ్డీ, వైఎస్సార్‌ చేయూత,అమ్మఒడి (Jagananna Ammavodi), వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, వైఎస్సార్‌ ఆసరా లాంటి పథకాలు అమలు చేస్తూ వారికి మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారత కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన కొత్త కానుకే ఈ ‘ఈబీసీ నేస్తం’.

ఇప్పటికే ఈబీసీ నేస్తం పథకం కోసం ఏపీ మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
ఎట్టకేలకు వాళ్లకు తీపి కబ్బురు వచ్చింది.

వైఎస్సర్‌ ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఏపీ రాష్ట్రంలోని 3.92 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ.589 కోట్లు వేయనున్నారు. ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి గారు ఈ రోజు 12.00 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి కంప్యూటర్ బటన్ ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జామ చేశారు.

Leave a Comment