రైతుబంధు దరఖాస్తు దేశానికి రైతు వెన్నుముక అనే నినాదం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజం చేస్తూ అన్నదాతల శ్రేయస్సు కొరకు తెలంగాణ సర్కార్ దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు పథకం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది.
రైతుబంధు దరఖాస్తు
ఇప్పటికే తెలంగాణలో యాసంగి సీజన్ స్టార్ట్ అయింది. ఈ యాసంగిలోనూ రైతులు సంఖ్యలో పెట్టుబడి కోసం రైతులు ఎవర్ని ఆశ్రయించకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ప్రారంభదశలో పెట్టుబడి సహాయాన్ని అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో ఐదు వేల రూపాయల చొప్పున నగదు జమ చేయడం జరుగుతుంది.
దేశంలో రైతుల కు అగ్రపీఠం వేస్తూ కేసీఆర్ సర్కార్ రైతులకు వరాల జల్లు కురిపిస్తోంది ఈ నేపథ్యంలో తాజాగా డిసెంబర్ 10వ తేదీ నాటికి ధరణి పోర్టల్ నమోదైన కొత్త పట్టాదారు పుస్తకాల కలిగిన రైతులు 2020-2021 యాసంగి రైతు బంధు పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు.
గతంలో రైతుబంధు సాయం పొందిన వారైతే తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది ఇక రైతుబంధు స్కీమ్ కోసం కొత్తగా అర్హులు ఎవరైనా ఉంటే వారి దరఖాస్తును స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు అందచేయాలని కోరింది దరఖాస్తుతోపాటు రైతుల పాస్ బుక్ జిరాక్స్ కాపీ లేదా తాసిల్దార్ డిజిటల్ సంతకం పెట్టిన కాయితం ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కాపీలు అందజేయాలని వ్యవసాయ శాఖ తెలిపింది.
రైతుబంధు నిధుల సమీకరణ పూర్తి కావడంతో,రైతుల బ్యాంకు ఖాతాలోకి నగదు పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు.ఇక రైతు బంధు నగదు తీసుకున్న రైతులు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అభినందనలు తెలియజేశారు ఇక వరి వేసిన రైతులకు సైతం రైతు బంధు పథకం అమలు చేయాలని కెసిఆర్ గారు నిర్ణయించారు.
కొత్తగా భూమీ యాజమాన్య హ క్కులు వచ్చిన రైతులు మాత్రమే ఏఈవోలకు డాక్యుమెంట్లు అందించి నమోదుపూర్తి చేసుకోవాలని వ్యవసాయశాఖ తెలిపింది.