కరోనా వైరస్ పైన గెలవాలంటే ఇవి తినాలి. Coronavirus Diet Chart 2020: What to Eat
Coronavirus Diet Chart 2020: What to eat, what to avoid
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్ లోకి ప్రవేశించింది. భారతదేశంలో కూడా కరోనా వైరస్ రావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇక రాష్ట్ర మరియు కేంద్రం కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. దీంతో ఇప్పటికే ఢిల్లీలో మరియు హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడటంతో చాలామంది భయంతో వణికిపోతున్నారు.మరో వైపు బహిరంగ ప్రదేశాల్లో గుంపులు గుంపులు గా ఉండే చోటా నడవటానికి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడుస్తున్నారు. ఇదే పరిస్థితి ప్రతిచోట ఏర్పడింది. ఒక విధంగా చెప్పాలంటే మరణం ఈ ప్రపంచంలో ప్రతీ దేశంలో ప్రతి ఒక మనిషిని గజగజలాడిస్తోంది. ఎవరైనా తుమ్మినా దగ్గినా ఆ ప్రాంతంలో ప్రజలు నడవటానికి సైతం భయపడే పరిస్థితి నెలకొంది.
మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకుంటే, ఎలాంటి వైరస్ వ్యాధులు దరిచేరవని ప్రముఖ ప్రకృతి వైద్యులు, మంతెన సత్యనారాయణ రాజు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం లాంటివి రాకుండా ఉండాలంటే, శరీరంలో రక్షణ వ్యవస్థ (Resistance Power) బలంగా ఉంటే ఏ జబ్బులు దరిచేరవని, విటమిన్ సి మన ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకుంటే మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుందని అప్పుడే కరోనా లాంటి మహమ్మారితో దీటుగా పోరాడవచ్చని చెబుతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.
విటమిన్ సీ రసాయనిక ‘ఏస్కార్బిక్ ఆమ్లం’. నిమ్మ, నారింజ జాతి ఫలాలు, ఉసిరి, ఆకుకూరలు, తాజా టమాటో బంగాళాదుంప, మొదలైన వాటిలో ఇది ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో చాలా మాటుకూ మన వంటింట్లో నిత్యం ఉంటాయి. నిమ్మకాయ మన ఫ్రీడ్జి లో సహజంగా ఉంటుంది.తినే పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే అల్లం, ఉల్లిపాయ,క్యారెట్లు, గుమ్మడికాయ, పసుపు లాంటివి రోజు ఒక్కసారైనా ఉండేలా చూసుకోవాలి. ప్రతి రోజు నాలుగు రకాల కూరలు లేదా పండ్లు కూరగాయలు ఆహారం లో తీసుకోవాలి.
ముఖ్యంగా బ్రోకలీ, పుట్ట గొడుగులు ఎంతో మేలు చేస్తాయి. . బెర్రీలు,అల్ల నేరేడు పండ్లు,బాదం గింజలు , దానిమ్మ , వారానికి మూడుసార్లు తినాలి . వీటిలో రోగ నిరోధక శక్తిని పెంచే బీ,సీ, ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. చేపలు, గుడ్లు, మాంసంలో కండరాలు, ఎముకలను బలంగా ఉంచే ప్రొటీన్లతోపాటు డీ సహా 20 రకాల విటమిన్లు ఉంటాయి. జింకు ఎక్కువగా ఉండే నత్త గుల్లలు కూడా వారానికి ఓసారి తినడం మంచిది.
Good info….