ఆసరా పెన్షన్ తెలంగాణ రాష్ట్రంలో 57 ఏళ్ల వయసు నిండిన నిరుపేదల ఆసరా వృద్ధాప్య పెన్షన్ అప్లై చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇక నెల అక్టోబర్ 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోని మీసేవ ప్రధాన కేంద్రాల్లో ఆసరా పింఛన్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసరా పెన్షన్
ఇక గతంలో వృద్ధాప్య పింఛన్లు చాలామంది అర్హులు దరఖాస్తు చేసుకోలేదని అసెంబ్లీ సమావేశాల్లో అనేక మంది ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ గారి దృష్టికి ప్రతిపాదన తీసుకువచ్చారు, వారందరికీ పింఛన్ దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం కల్పించారు. ఇక సీఎం కేసీఆర్ ఆదేశాలతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎస్ సోమేష్ కుమార్ గారు పింఛన్ దరఖాస్తు తేదీలను పొడిగించాలని సంబంధిత అధికారులను తక్షణమే ఆదేశించారు.
ఇక అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకున్న తరువాత వారి వివరాలను పరిశీలించి స్క్రూటినీ చేసి అర్హత కలిగిన వారందరికీ వెంటనే ఆసరా పింఛన్లు అమలయ్యేలా చూడాలని కెసిఆర్ గారు పంచాయతీరాజ్ అధికారులు సైతం ఆదేశించారు.
ఆసరా పెన్షన్ అర్హులు:
->దరఖాస్తుదారుని పేరు పై 7.5 ఎకరాలు మెట్ట భూమి మూడు ఎకరాలు మాగాణి కన్నా ఎక్కువ ఉండకూడదు.
->ఇక్కడ వారి పేరుమీద ఫోర్ వీలర్ వెహికల్ ఐటీ రిటర్న్స్ ఉన్న ఈ పథకం వర్తించదు.
->పెన్షన్ పొందాలంటే ప్రభుత్వ ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గా ఉండకూడదు.
->ఆధార్ కార్డు ఓటర్ ఐడి లో సరైన డేట్ అఫ్ బర్త్ కలిగి ఉండాలి.
ఇంకా మీలో ఎవరైనా ఆసరా పెన్షన్ అర్హత ఉంటే అక్టోబర్ 30వ తేదీ లోపు అప్లై చేసుకోండి