బ్యాంకు ఖాతాదారులకు ముఖ్యమైన అలెర్ట్.మీకు బ్యాంకు లో అకౌంట్ ఉంటే ఈ విషయం తెలుసుకోవాలి.
మార్చి 2021 బ్యాంకు సెలవులు
బ్యాంకులో మీకు ముఖ్యమైన పనులు ఉన్నాయా దేశవ్యాప్తంగా మార్చి నెలలో బ్యాంకులు 11 రోజుల వరకు సెలవులు ఉన్నాయి.ఇక తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) క్యాలెండర్ ప్రకారం మార్చి నెలలో అనేక రాష్ట్రాల్లో ఐదు రోజులు సెలవు దినాలు ఉన్నాయి.
మార్చి నెల మొత్తం 31 రోజులు ఉంటే అందులో నాలుగు ఆదివారాలు నాలుగు శనివారాలు ఉన్నాయి రెండో శనివారం 4వ శనివారం బ్యాంకు సెలవులు వీటితో పాటు మహా శివరాత్రి పండుగ హోలీ కూడా మార్చిలోనే వచ్చాయి. దీంతో మరో రెండు రోజులు బ్యాంకు హాలిడేస్.
మార్చి 5, 11, 22, 29, 30 తేదీల్లో బ్యాంకులకు సెలవు ఉంటాయని ఆర్బీఐ మార్గదర్శకాలు వెల్లడించాయి.ఇక మార్చి నెల మధ్యలో బ్యాంక్ యూనియన్ లు సమ్మెకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 15 16 తారీకు లో బ్యాంకింగ్ చేపట్టబోతున్నారు.
మార్చి నెల 2021లో బ్యాంకు సెలవులు తేదీలు :
5 మార్చి: చాప్చెర్ కుట్
7 మార్చి: ఆదివారం
11 మార్చి: మహాశివరాత్రి(Maha Sivaratri)
13 మార్చి: రెండో శనివారం(Second Saturday)
14 మార్చి: ఆదివారం
27 మార్చి: నాలుగో శనివారం
28 మార్చి: ఆదివారం
30 మార్చి: హోలీ
మీకు బ్యాంకు లో ఏమైనా ముఖ్యమైన లావాదేవీలు ఉంటే వెంటనే బ్యాంకు కి వెళ్లి మీ పనులు చక్కదిద్దుకోండి.