మీ PF డబ్బులు విత్‌డ్రా చేయడం ఎలా ? కరోనా మహమ్మారి నేపథ్యం సమయములో

మీ PF డబ్బులు విత్‌డ్రా చేయడం ఎలా ? కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన ఆర్థిక నేపథ్యం సమయములో

Coronavirus is now another reason to make a pf withdrawal Online

  • ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO పాండమిక్ అడ్వాన్స్ ఫెలిసిలిటీని ప్రారంభించింది. అంటే కరోనా వైరస్ మహమ్మరిని ఒక కారణంగా చూపించి మీరు మీ పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
Good News For Employees Provident Fund EPF Subscribers
  • కొద్ది రోజుల క్రితం ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం రెండు పెద్ద శుభవార్తలు చెప్పిన సంగతి తెలిసిందే. 100 మంది ఉద్యోగులు ఉన్న చిన్న సంస్థల్లో రూ.15,000 లోపు వేతనం తీసుకునేవారికి ఎంప్లాయీ షేర్ 12%, ఎంప్లాయర్ షేర్ 12% మూడు నెలల పాటు ప్రభుత్వమే చెల్లిస్తుంది.
  • మీ  పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75% లేదా మూడు నెలల వేతనంలో ఏది తక్కువ అయితే అది నాన్ రీఫండబుల్ అడ్వాన్స్‌గా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కేంద్రం కల్పించింది.
  • కేంద్ర ప్రభుత్వ సూచనల  మేరకు కార్మిక శాఖ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO విత్‌డ్రా నిబంధనల్ని మారుస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కరోనా వైరస్
  •  మహమ్మారి కారణంగా సుమారు 6 కోట్ల మంది ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు నాన్-రీఫండబుల్ అడ్వాన్స్ తీసుకునే వెసులుబాటు కల్పించింది.
  • కరోనా వైరస్ దృష్ట్యా ఈపీఎఫ్ డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు 2020 మార్చి 28 నుంచి ఇది అమలులోకి వచ్చింది. పాండమిక్ అడ్వాన్స్ ఫెలిసిలిటీని ప్రారంభించింది.
  • మీ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేయడానికి ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ అకౌంట్ ఓపెన్ చేయండి.
  • మీ యూఏఎన్ ఐడీ,పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి. ఆ తర్వాత ఆన్‌లైన్ సర్వీసెస్‌లో క్లెయిమ్ ఫామ్ పైన క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ మీ పూర్తి వివరాలు చెక్ చేసుకోండి.
  • అందులో అడిగిన వివరాలు ఎంటర్ చేయండి. ఆ తర్వాత పీఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31 పైన క్లిక్ చేయండి.
  • మీ బ్యాంక్  పాస్‌బుక్  లేదా చెక్ బుక్  కాపీ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆధార్ ఓటీపీతో వేలిడేట్ చేయాలి. ఓటీపీ ఆథెంటికేషన్ పూర్తైన తర్వాత 3 రోజుల్లో మీ డబ్బులు అకౌంట్‌లోకి వస్తాయి.
  • సాధారణంగా ఇప్పటివరకు ఉన్నత చదువు ,వివాహం గృహ నిర్మాణం లాంటి పలు  కారణాలతో అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు కరోనా వైరస్ సంక్షోభాన్ని ఓ కారణంగా చూపిస్తూ అడ్వాన్స్ తీసుకోవచ్చు.
  • ఈపీఎఫ్ డబ్బులు డ్రా చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.  మీ పిల్లల పెళ్లిళ్లు లేదా చదువులు అవసరాల కోసం. మీ రిటైర్మెంట్ సమయంలో  కాపాడేది  ఈ డబ్బులే.

1 thought on “మీ PF డబ్బులు విత్‌డ్రా చేయడం ఎలా ? కరోనా మహమ్మారి నేపథ్యం సమయములో”

Leave a Comment