ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ మరోసారి స్థానం కైవసం చేసుకున్నాడు.ప్రపంచ ప్రముఖ టాప్ సంస్థ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌ను పక్కకు నెట్టి ఆయన ఈ స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఎలాన్ మస్క్
మస్క్ 12ఏళ్ల చిన్న వయస్సులో బ్లాస్టర్ అనే వీడియోగేమ్‌ను తయారు చేశాడు.17ఏళ్ల వయస్సులో దక్షిణాఫ్రికా సైన్యంలో పనిచేయడం ఇష్టం లేక కెనడా వెళ్ళిపోయి చదువ ఫై ద్రుష్టి పెట్టాడు. అయన మనస్సు మొత్తం వ్యాపారం పైనే ఉండేది. అందుకే వ్యాపారంలో ఎన్నో విజయాలు తన సొంతం చేసుకున్నాడు.
ప్రైవేటు రంగంలో అతిపెద్ద రాకెట్ ఇంజిన్ల తయారీ సంస్థగా స్పేస్ ఎక్స్ అవతరించింది. మస్క్ మానసపుత్రికల్లో టెస్లా
మరో ఒకటి.
elon musk
2002లో స్పేస్ ఎక్స్‌ను ప్రారంభించిన తర్వాత 2003లో టెస్లాకు జీవం పోశాడు.
టెస్లా షేర్ల విలువ అమాంతం ఒక్కసారిగా పెరగడంతో మస్క్ ఈ మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
తాజా బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారంఎలాన్ మస్క్ సంపద 199.9 బిలియన్ డాలర్లు. జెఫ్‌బెజోస్ సంపద 194 బిలియన్ డాలర్లు.ఇక రానున్న రోజుల్లో జెఫ్‌బెజోస్ ఎలాన్ మస్క్ మధ్య తీవ్ర పోటీగా కనిపిస్తుంది.