Telangana indiramma house – ఇందిరమ్మ ఇళ్ల Indiramma Indla Scheme App Will Be Launched
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని వారికి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన మ్యానిఫెస్టోలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ముఖ్యమైనది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇక ఈ పథకం అమలు కోసం తెలంగాణలో ప్రజలు ఎంతో కాలంగా ఆసక్తిని ఎదురుచూస్తున్న నేపథ్యంలో డిసెంబర్ మొదటి వారంలో ఇందిరా మహిళల పథకాన్ని ప్రారంభించినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇందిరమ్మ ఇళ్ళు
ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కీలక అప్డేట్ అయితే ఇచ్చారు డిసెంబర్ 5 నుంచి ఇందిరమ్మ ఇళ్ల యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రావు గారు చెప్పారు.
డిసెంబర్ నుంచి ఇందిరమ్మ యాప్ ప్రారంభం
Telangana indiramma house – ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇల్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు ఒక్కో నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిర అమ్మాయిలు ఇస్తామన్నారు వీటి కోసం ఇప్పటికే 3,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.ఇక లబ్ధిదారులు ఎంపిక కోసం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను సైతం నియమించినట్లు తెలిపారు, ఇక తెలంగాణలో కాంగ్రెస్ రాష్ట్ర సర్కారు ఉన్నంతకాలం ఈ ఇల్లు పంపిణీ కొనసాగుతుందని తెలిపారు.
ఇక తొలి దశలో సొంత స్థలాలు ఉన్నవారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో లబ్ధిదారులకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తామన్నారు ముఖ్యంగా దివ్యాంగులు సాగు భూమిలేని వారు వ్యవసాయ కూలీలు పారిశుద్ధ కార్మికులు ఇలా అందరికీ సమ ప్రాధాన్యత కల్పించాలని వివరించారు.ఇందిరమ్మ యాప్ లో ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా గిరిజన ఆదివాసి ప్రాంతీయులు ఐటీడీఏలు పరిధిలో ఇందిరమ్మ మహిళలకు సంబంధించి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.