గోదావరి నది పుష్కరాలకు సుముహూర్తం ఖరారైంది 2027 జూలైలో జరిగే గోదావరి పుష్కరాలకు తేదీలు ఖరారు అయ్యాయి జూలై 23వ తేదీ నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు ఈ పుష్కరాలు నిర్వహించనున్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులన్నిటికీ పుష్కరాలు వస్తాయి ఇక పుష్కర సమయంలో ఆయా నదుల్లో స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం ప్రార్థిస్తుందని హిందువులు భావిస్తారు.
కోట్లాదిమంది ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు దేశ విదేశాల నుంచి జనాలు భారీగా తరలివస్తారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ పుష్కరాల కోసం ఏపీ రాష్ట్ర సర్కార్ ఏర్పాటులు ఇప్పటికే మొదలుపెట్టింది. ఈసారి పుష్కరాల కోసం ఏకంగా ఎనిమిది కోట్ల మంది భక్తులు తరలి వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీంతో గోదావరి జిల్లాలో పుష్కర ఘాట్ల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 904 కోట్లతో ప్రతిపాదనలు అధికారాంతరంగం సిద్ధం చేసింది.
ఇక రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ కార్డు మూడు విడుదల్లో ఈ పుష్కర పనులు చేపడుతామని తెలిపారు. మొత్తంగా 400 కోట్ల రూపాయలతో గోదావరి బండ రోడ్లను విస్తరించి అదనంగా 17 పుష్కర ఘాట్లు నిర్మించాల్సి వున్నారు మొత్తంగా 74 పార్కింగ్ ప్రాంతాలకు 800 ఎకరాలను ఏర్పాటుకు సహకరిస్తున్నామన్నారు.
ఇక పుష్కరాలకు తరలివస్తే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా a గాట్ల వద్ద భక్తుల సంరక్షణకు ప్రత్యేక ఉచిత మెడికల్ క్యాంపులు అలాగే స్నానం చేసిన తర్వాత స్త్రీలు ఇబ్బంది పడకుండా స్నానం గదులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ పుష్కరాల కోసం అనేక కార్యక్రమాల కోసం స్వయం సహాయక సంఘాల్లో మహిళలకు 30 రోజులు పాటు శిక్షణ తరగతులను చేపట్టబోతున్నట్లు అధికారులు తెలిపారు.