మ్యారేజ్ సర్టిఫికేట్ అనేక పథకాలకు కీలక పత్రం.భారతదేశంలో వివాహ జీవితంలో ప్రత్యక స్థానం ఉంది.కొత్తగా పెళ్లయిన యువ జంటలకు మ్యారేజ్ సర్టిఫికేట్ ద్వారానే రేషన్ కార్డుల ప్రక్రియ జారీ చేస్తున్నారు వివాహాలను చట్టబద్ధం చేసేందుకు 2006 సంవత్సరంలో సుప్రీంకోర్టు వివాహ నమోదు ప్రక్రియను తప్పనిసరి చేసింది. ఇక వివాహ రిజిస్ట్రేషన్ నమోదును ఆన్లైన్ ఆఫ్ లైన్ పద్ధతుల్లో అయితే పూర్తి చేసుకోవచ్చు.
AP Marriage Certificate
గతంలో 30 40 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న పెళ్లి జంటలు ఇప్పుడు పెళ్లికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడితే ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్న విషయం తెలియక చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో వివాహాల నమోదుకు సంబంధించి ఉన్న ఫీజులు కూడా పెరిగాయి వివాహం రిజిస్ట్రేషన్ ఫీజు 200 రూపాయలు ఉండగా దాన్ని ఇప్పుడు 500 రూపాయలకు పెరిగింది.భారతదేశంలో 1955 హిందూ వివాహ చట్టం కింద లేదా 1954 వివాహ ప్రత్యేక చట్టం కింద మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది మీరు వివాహం చేసుకున్నారని దృవీకరించే ముఖ్యమైన సర్టిఫికేట్ ఇది. స్త్రీల రక్షణ కోసం వివాహాన్ని నమోదు చేసుకోవడం సుప్రీంకోర్టు 2006 సంవత్సరంలో తప్పనిసరి చేసింది.
మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆన్ లైన్ విధానం
- వివాహ పత్రం కావలసినవారు ముందుగా https://cdma.ap.gov.in/en/marriageregistration వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి
- హోం పేజ్ లో న్యూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ లో మీ జిల్లా మున్సిపాలిటీ నగర కార్పొరేషన్ పంచాయతీ వివరాలను ఎంటర్ చేయాలి
- అప్పుడు మీకు ఒక కొత్త పేజీ వస్తుంది మెమొరండం ఆఫ్ మ్యారేజ్ ఫామ్ బి లో పెళ్లికూతురు పెళ్లి కొడుకు పూర్తి వివరాలు నమోదు చేయాలి
- పెళ్లికూతురు పెళ్ళికొడుకు ఇద్దరు సాక్షులు వివరాలను సైతం ఎంటర్ చేయాలి
- ఇందులోనే రిజిస్ట్రేషన్ యూనిట్ మ్యారేజ్ ఫోటో మ్యారేజ్ ఫీ డేట్ ఆఫ్ మ్యారేజ్ పూర్తి వివరాలు, ఆధార్ కార్డు వివరాలు,అలాగే పాస్ ఫోటోలను సైతం అప్లోడ్ చేయాలి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సబ్మిట్ చేయాలి.
- ఈ విధానం నగర పంచాయతీలు మున్సిపాలిటీలలో అమలు చేస్తున్నారు.
- మీ సేవలో కూడా మీరు మ్యారేజ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ లైన్ విధానం
హిందూ పెళ్లిళ్లు ప్రత్యేక వివాహాలను సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో మాన్యువల్ గా ఎంటర్ చేసిన రిజిస్టర్ చేస్తారు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుకు పెళ్లికొడుకు పెళ్ళికూతురు పెళ్లి కార్డు వివాహ ఫోటో పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఆధార్ కార్డ్ అలాగే సాక్షులు ముగ్గురు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి సంబంధిత ఫామ్‌ను పూర్తి చేసి అందించాలి ఆ ఫామ్ సబ్ రిజిస్టర్ పరిశీలించి రిజిస్ట్రేషన్ పుస్తకంలో నమోదు చేసుకుంటారు ఆ తర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్ జారీ చేసి దానిపై సంతకం చేసి ఇస్తారు.
కావాల్సిన పత్రాలు
- అడ్రస్ ప్రూఫ్ : ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్/డ్రైవింగ్ లైసెన్స్/పాస్ పోర్ట్
- వివాహ ఆహ్వాన పత్రిక
- భార్యాభర్తలు పుట్టిన తేదీల ప్రూఫ్
- మ్యారేజ్ ఫోటో ,రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు
- వివాహ తేదీ
- సాక్షులు వారి చిరునామా
మ్యారేజీ సర్టిఫికెట్ ఫీజు
హిందూ వివాహ చట్టం కింద రూ. 100
ప్రత్యేక వివాహ చట్టం కింద రూ. 150