ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు చంద్రబాబు కొత్త సర్కార్ తీపి కబ్బురు అందించింది.రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీఎం చంద్రబాబు మెగా DSC ప్రకటన సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
AP Mega DSC 2024
ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) కూటమి ఘన విజయం సాధించడంతో నిరుద్యోగులు పోస్టులు కోసం ఆశగా ఎదురుచూశారు.దీంతో ఉపాధ్యాయ శిక్షణ పొంది.. ఉద్యోగాల ప్రకటన కోసం వేచి చూస్తున్న అభ్యర్థులు AP Mega DSC హామీ అమలు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఏపీ రాష్ట్ర విభజన అనంతరం 16 వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం ఇదే మొదటి సారి.గత ప్రభుత్వం లో జాబ్ కేలండర్ కోసం ఎదురు చుసిన నిరుద్యోగులు ఇప్పుడు ఉత్సాహంతో ఉన్నారు. మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు మొదటి సంతకం చేశారు. దింతో ఇప్పుడు అభ్యర్థులు కోచింగ్ సెంటర్స్ కు క్యూ కడుతున్నారు. అలాగే పోస్టులు సంఖ్య, పరీక్ష నిర్వహణ,సిలబస్ తేదీలపై రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు చర్చించుకుంటున్నారు.
కేటగిరిల వారీగా ఖాళీల వివరాలు
- ఎస్జీటీ : 6,371
- స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులు 7725
- పీఈటీ : 132
- పీజీటీ పోస్టులు 286
- టీజీటీ పోస్టులు 1781
APPSC Group 2 Exam 2024 – ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్థులకు సూచన
ఏపీ గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ (APPSC) కమిషన్ కొన్ని ముఖ్య ఆదేశాలు జారీ చేసింది.పోస్టు, జోనల్, జిల్లా ప్రాధాన్యాలను అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/ లో నమోదు చేయాలని సూచించింది.ఈ ప్రక్రియ జూన్ 5వ నుండి 18వ తేదీతో ముగుస్తుంది.అధికారుల 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తు మొదలు పెట్టనున్నారు.