అన్నదాతలకు సీఎం రేవంత్ సర్కార్ శుభవార్త.! గోల్డ్ లోన్ పైన రుణమాఫీ?

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది. తాజాగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా 6 గారంటీని అమలు చేస్తామని చెప్పడమే కాక సాధ్యమైనంత వరకు వాటిని అమలు చేసింది తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ అయితే తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొన్ని సంక్షేమ పథకాలు హామీలకు బ్రేక్ పడింది.

రుణమాఫీ

ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ ఐదు గ్యారంటీని అమలు చేసింది ఆరోగ్యశ్రీ పెంపు ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీకరం ఇందిరమ్మ ఇల్లు 500 రూపాయలకే గ్యాస్ సంక్షేమానికి కృషి చేస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ సర్కార్ తాజాగా రైతన్నలపై ప్రత్యేక దృష్టి సారించింది ఈ మేరకు ప్రణాళికల సిద్ధం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద ఈ ఖరీఫ్ సీజన్ నుంచే రైతన్నల ఖాతాలో 15 వేల రూపాయలు జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

దింతో పాటు తెలంగాణ రైతాంగం ఎంతో ఆసక్తిగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా రైతు రుణమాఫీ పథకంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే కాదు దీని అమలుకు సాధ్యసాద్యాల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తో సహా పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు ఇక ఆగస్టు 15వ తేదీన రైతు రుణమాఫీ ప్రక్రియ అమలు చేసేలా ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ పథకం కోసం ఇప్పటికే బ్యాంకు నుంచి నాలుగు విభాగాలు 30 అంశాలతో కూడిన పూర్తి ప్రొఫార్మాతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కావాల్సిన సమాచారాన్ని బ్యాంకుల వద్ద నుండి సేకరిస్తున్నాయి.

ఇక ఒక వ్యక్తికి రెండు లేదా మూడు ఎకౌంట్లో ద్వారా రెండు లక్షల వరకు రుణం తీసుకుని ఉంటే ఆ రుణమాఫీ చేస్తామని తెలిపారు అయితే ప్రతి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు ఈ క్రమంలో రైతు రుణమాఫీకి సంబంధించి కీలక నిర్ణయం తెలిపింది. రైతులు గోల్డ్ లోన్ తాకట్టు తీసుకుంటే వాటికి కూడా రుణమాఫీ వర్తిస్తుందా అని ఈ మేరకు ప్రభుత్వం విధివిధానాలను కసరత్తు చేస్తుందని సమాచారం.రుణమాఫీ చేస్తే రైతులు ఏంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.అయితే దీని పైన అధికారక ప్రకటన చేయాల్సి ఉంది.

Leave a Comment