దేశవ్యాప్తంగా ప్రతిరోజు కొన్ని వేల వాహనాలు రోడ్లపైకి వస్తుంటాయి ఇక సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి పని కోసం వాహనాలను నడుపుతున్నారు వాహనాన్ని నడిపేందుకు ఇక డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి ఈ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఏ ఉంటుంది. ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరగాలి ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకొని డ్రైవింగ్ టెస్ట్ చేసి బయోమెట్రిక్ తదితర అంశాల కోసం ఆర్టీవో ఆఫీస్ చుట్టూ కనీసం ఒక ఐదు సార్లు ప్రదక్షిణ చేస్తే కానీ డ్రైవింగ్ లైసెన్స్ మీ ఇంటికి అందుకోలేరు.కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్‌పై తాజాగా కొత్త విధివిధానాలను రూల్స్ తీసుకువచ్చింది.
Driving Licence rules
ఇకనుంచి ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థల్లో మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ చేసే విధంగా కొత్త చట్టాలను మార్చింది మార్చిన ఈ సరికొత్త రూల్స్ ను జూన్ 1 2024 నుంచి అమలులోకి రానున్నాయి కాగా కొత్త రూల్స్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గుర్తింపు పొందిన ప్రభుత్వం నిర్దేశించిన పలు సదుపాయాలు ఉన్న గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థల ద్వారా డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి ఈ డ్రైవింగ్ సర్టిఫికెట్ మన ఇంటికి పోస్ట్ ద్వారా ఇవ్వవచ్చు అలాగే ఫోర్ వీలర్ అంతకంటే ఎక్కువ లైసెన్సులు టెస్ట్ నిర్వహించాలంటే ప్రైవేట్ డ్రైవింగ్ సెంటర్‌కు కనీసం మూడు ఎకరాల స్థలం డ్రైవింగ్ లో 5000 అనుభవం ట్రైన్ లకు హైస్కూల్ విద్య కలిగి ఉండాలి.
ఇక గతంలో లాగా సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికెట్ రాదు పూర్తిగా డ్రైవింగ్ లో నైపుణ్యం ఉన్నవారికి మాత్రమే డ్రైవింగ్ సర్టిఫికెట్‌ను ఇష్యూ చేయనున్నారు.హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆరువారాలు 39 గంటల శిక్షణ శిక్షణ అవసరం 31 గంటల పాటు ప్రాక్టికల్ మిగతా ఎనిమిది గంటలు తీరి ఉంటుంది లైట్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ నాలుగు వారాలు గాని కనీసం 29 గంటల శిక్షణగానే ఉండాలి ఇందులో 21 గంటలు ప్రాక్టికల్ 8 గంటలథియరీ కచ్చితంగా ఉండాలి.
డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్
ఈ సరికొత్త నిబంధనలు కచ్చితంగా పాటించే వారికి మాత్రమే డ్రైవింగ్ టెస్ట్ సర్టిఫికెట్ జారీ చేసే అధికారం కలిపింది కేంద్ర రోడ్డు రవాణా సంస్థ. ఈ ప్రక్రియ ద్వారా ఎటువంటి ఇతర పరీక్షలు లేకుండా నేరుగా లైసెన్స్ మంజూరు అవుతుంది. అయితే మనం ఆర్టీవో ఆఫీస్ లో ముందుగా ఎల్ ఎల్ ఆర్ స్లాట్ తీసుకున్న తర్వాతే ఈ పూర్తి ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది.