దేశవ్యాప్తంగా అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలు అమలు చేస్తుంది వీటిలో కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కూడా చాలా ముఖ్యమైనది. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులకు ఈ స్కీం ద్వారా రైతులు తమ ఆకస్మిక ఆర్థిక అవసరాన్ని తీర్చుకోవడానికి స్వల్ప కాలిక పదవీకాలం రుణాలు పొందుతారు. ఈ కార్డు ద్వారా మూడు లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది.ముఖ్యంగా 1,60,000 వరకు మనం తీసుకునే బ్యాంకులను ఎలాంటి షూరిటీ గ్యారెంటీ అడగదు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసమే ఈ రుణాల్ని రైతులు తీసుకోవచ్చు.
కిసాన్ క్రెడిట్ కార్డు
పావలా వడ్డీకే నాలుగు శాతంతో మూడు లక్షల రూపాయల వరకు రుణం లభిస్తుంది. ఇక రైతులు తీసుకున్న రుణాలు ద్వారా మనం పశువులు ఇతర వాటిని కొనుగోలు చేయవచ్చు లేకపోతే వ్యవసాయ పరికరాలు యంత్రాలు సమకూర్చుకోవడానికి సైతం ఈ రుణం మనకు బాగా ఉపయోగపడుతుంది దీనికి ఎలాంటి షరతులు కూడా లేవు అప్పును తీర్చే విషయంలో కూడా రైతులకు అనుకూలంగా షరతులు ఉన్నాయి కిసాన్ క్రెడిట్ కార్డుతో అర్హులైన రైతులకు స్మార్ట్ కార్డ్ డెబిట్ కార్డ్ సేవింగ్ అకౌంట్ నుంచి కూడా పలు రకాల ఆప్షన్స్ కూడా లభిస్తాయి.
ఇక ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు వల్ల ఆ యొక్క లబ్ధిదారుల యొక్క శాశ్వత వైకల్యం లేదా మరణానికి గురైతే వారి కుటుంబానికి 50 వేల వరకు భీమా కూడా ఉంటుంది. ఒకవేళ వేరే కారణాల రీత్యా వైద్య విషయంలో ఖర్చులు నిమిత్తం 25వేల రూపాయల లభిస్తుంది.
కిసాన్ క్రెడిట్ కార్డ్ అర్హతలు అప్లై చేసే విధానం
- 18 నుండి 75 ఏళ్ల వయసు కలిగిన వారై ఉండాలి.
- పసుపు పోషణ వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమంలో ఉండాలి
- పొలం సాగు చేస్తున్న రైతు యజమాని ఉండాలి.
- గొర్రెలు కుందేలు పందులు పక్షులు, కోళ్ల పెంపకం రైతులు కూడా ఈ పథకానికి అర్హులు.
కావలసిన పత్రాలు
- పాన్ కార్డ్
- ఆధార్ కార్డ్
- బ్యాంక్ పాస్ బుక్
- భూమి పత్రాలు
ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం రైతులందరూ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పద్ధతి ద్వారా కూడా అప్లై చేసుకునే సదుపాయం కలదు ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం మీ దగ్గర అనే బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి సంప్రదించాలి.