పిడుగు అంటే ఆకాశములో సహజసిద్ధముగా ఉత్పన్నమయిన విద్యుత్పాతము. పిడుగును ఇంగ్లీషులో “Thunderbolt” అని అంటారు.
భూమి మీద ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో దాదాపు 25 వేల అడుగుల ఎత్తు వరకూ మేఘాలు ఏర్పడతాయి. అయితే పైనుంచి సూర్యరశ్మి అధికంగా తాగడం వల్ల తక్కువ బరువున్న ధనావేశిత మేఘాల పైకి వెళ్తాయి
అధిక బరువుండే రుణావేశిత మేఘాలు కిందకి వస్తాయి. అంటే ఎప్పుడూ మనకు కనిపించే దట్టమైన మబ్బుల్లో ఎలక్ట్రాన్ లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సైన్స్ ప్రకారం రుణావేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు సమీపంలోని మేఘాల వైపు ఆకర్షిత పోతుంటాయి
అయితే ధనావేశిత మేఘాలు చాలా ఎత్తుకు వెళ్ళిపోయినప్పుడు దగ్గరలో మరే వస్తున్నా నా ఉన్నా అటువైపు ఎలక్ట్రాన్లు ప్రయాణిస్తాయి. ఆ క్రమంలోనే మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్ క్షేత్రంగా మారి భూమి మీదకు దూసుకు వస్తాయి దాన్నే పిడుగు పడటం అంటారు. మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు విడుదలయ్యే సమయంలోనే ఉరుములు మెరుపులు పుడతాయి.
అలా మేఘాల నుంచి పడే “పిడుగు” దాదాపు 30 కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది ,అది మనిషిని అక్కడికక్కడే కాల్చి బూడిద చేయగలదు
ప్రధానంగా ఎండా కాలంలో సముద్ర తీర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి.దాంతో ఆయా ప్రాంతాల్లో పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని తాజాగా నాసా పరిశోధనలో తేలింది . ఇదే పిడుగులు ఉరుములు పుట్టడానికి అసలు కారణం.
అందులోనూ సముద్రంలో కంటే భూమిపైనే పిడుగులు ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయి. పిడుగుపాటును ఆపివేసేందుకు ఇల్లు బిల్డింగ్స్ మీద కొన్ని చిన్న సెన్సర్ల ఏర్పాటు చేశారు.ఈ సెన్సర్ల ద్వారా ఎక్కడ ఏ సమయంలో పిడుగులు పడే అవకాశముందో తెలుసుకోవచ్చు .
30 నుంచి 40 నిమిషాల ముందే పిడుగు పడబోయే ప్రాంతాన్ని గుర్తించవచ్చు.