AP DSC Notification 2024 – ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల.! 6100 పోస్టులు పూర్తి వివరాలు

AP DSC Notification 2024 – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఏపీలో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.ఇక ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఏపీ డీఎస్సీ 2024 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

మొత్తం 600 పోస్టుల్లో 2280 ఎస్జీటీ పోస్టులు,2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1264 టీజీటీ పోస్టులు, 215 పిజిటి పోస్టులు, 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయని ఏపీ విద్యాశాఖ ప్రకటించింది.

ఏపీ డీఎస్సీ ముఖ్యమైన తేదీలు

ఇక ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఏపీ డీఎస్సీ 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని అర్హత ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వచ్చే నెల మార్చి 5వ తేదీ నుంచి నేరుగా ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనంతరం మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.

మొత్తం రెండు సెషన్స్ ఉంటాయి. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇక రెండో సెషన్ మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది మార్చి 31వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేస్తారు ఏప్రిల్ ఒకటో తేదీకి కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు ఆ వెంటనే ఏప్రిల్ రెండో తేదీన ఫైనల్ కీ విడుదల చేస్తారని తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి తెలిపారు.

AP DSC Notification 2024 -డీఎస్సీ అభ్యర్థులు ఎవరైనా వేరే రాష్ట్రాల్లో ఉన్న అభ్యర్థుల కోసం కూడా ప్రత్యేక పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది అభ్యర్థులు డీఎస్సీ సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ సైట్ లింక్ https://cse.ap.gov.in/loginhome చూడాలని సూచించారు.

Leave a Comment