రూ.500కే సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఎప్పటి నుంచి అంటే

500కే సిలిండర్ – తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ ఇప్పటికే ఆరు గ్యారంటీల స్కీమ్స్ లో భాగంగా కొన్ని పథకాలు అమలు చేసిన సంగతి తెలిసిందే ఇక ఆరు గ్యారెంటీల లో మరో రెండు గ్యారెంటీన్ త్వరలోనే అమలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎప్పుడు నుంచి ఈ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తారని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర సర్కార్ నుండి ఇప్పుడే మనకి గ్రీన్ సిగ్నల్ అందింది.

500కే సిలిండర్

ఇక ఆరు గ్యారెంటీ ల స్కీమ్స్ లో భాగంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ముగిసిన నేపథ్యంలో డేటా ఎంట్రీ కూడా పూర్తయింది ఇక ఏ ఏ పథకాలకు ఎవరు నిజమైన అర్హులు అని తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇప్పుడు అర్హుల జాబితాను రూపొందించే పనిలో పూర్తిగా నిమగ్నమైంది. ఇక మూడు గ్యారెంటీలు అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు వీటిలో రెండిటిని తక్షణమే అమలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు ఆ రెండు ఏంటి అనే నిర్ణయం కోసం ఈనెల 6న సీఎం మరోసారి ప్రజాపాలన సబ్ కమిటీతో భేటీ అన్నారు.

6 గ్యారంటీల పథకాలకు సంబంధించి ఒక కోటి 9,125 దరఖాస్తులు వచ్చాయి జనవరి 12వ తేదీ నాటికి ఈ దరఖాస్తులకు సంబంధించిన డేటా ఎంట్రెన్స్ రికార్డు సమయంలో పూర్తి చేసిన అధికారులు తెలిపారు. ఇక 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇందిరమ్మ ఇల్లు 2 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలపై సంబంధిత విభాగాల అధికారులతో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు చర్చించారు.

అనంతరం ఒక్కో గ్యారెంటీ అమలకు ఎంత వెర్చించాలి ఎంత ఖర్చవుతుంది అని ఆర్థిక నిపుణులు అడిగి తెలుసుకున్నారు ఈ బడ్జెట్ లోనే వీటికి అవసరమైన అన్ని నిధులను సమకూర్చి లబ్ధిదారులకు ఈ పథకాలను అమలు చేయాలని ఆర్థిక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

Leave a Comment