తెలంగాణ ప్రజలకు అభయ హస్తం దరఖాస్తు ఫామ్స్ ఇలా ఉచితంగా పొందండి..!

అభయ హస్తం దరఖాస్తు : తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28వ తేదీ నుంచి అన్ని పథకాలకు సంబంధించిన అభయహస్తం దరఖాస్తులను స్వీకరిస్తుంది ఈ దరఖాస్తుల ద్వారా అన్ని పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను విధివిధానాలను అలాగే అర్హతలను ఈ అవయహస్తం దరఖాస్తు ద్వారా పరిశీలిస్తారు.

అభయ హస్తం దరఖాస్తు

ఇక తెలంగాణలో సంక్షేమ పథకాలకు సంబంధించి రేషన్ కార్డు నుంచి చేయూత పెన్షన్ వరకు అభయహస్తం ఫామ్ చాలా ముఖ్యమైనది అయితే ఈ అభయహస్తం అప్లికేషన్ను బయట మార్కెట్లో అనేకమంది 20 నుంచి 30 రూపాయలకు అమ్ముతున్నారు దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఒక ప్రకటన విడుదల చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు వార్డులు కౌంటర్లలో ఏర్పాటుచేసి ఈ అవయహస్తం ఫామ్స్ ను ఫ్రీగా అందిస్తున్నారు ప్రజాపాలన గ్రామసభల్లోనూ ఈ ఫార్మ్స్ ఉచితంగా ఇవ్వనున్నారు వీటి కోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు ఉచితంగా ఇచ్చే అప్లికేషన్ అని ఎవరు డబ్బులు చెల్లించవద్దని కోరుతున్నారు ఇక ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసుల్లో పంచాయతీ ఆఫీసులో వీటిని ఉచితంగా అందిస్తారని స్పష్టం చేస్తున్నారు.ఈ ఫాం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీసేవ ఆధార్ సెంటర్ లకు జనాలు భారీగా తరలివస్తున్నారు.

అభయహస్తం దరఖాస్తు కావాలనుకున్నవారు ఈ కింద లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని ప్రింట్ అవుట్ తీసుకొని మీ పూర్తి వివరాలు నింపి మీ గ్రామంలో నిర్వహించే గ్రామ సభలో ఈ అభయ హస్తం దరఖాస్తు అందజేయాల్సి ఉంటుంది ఇక డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ సభలో నిర్వహిస్తారు ఆ తర్వాత కూడా మీ మండల గ్రామస్థాయిలోని ప్రభుత్వ ఆఫీసుల్లో దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు.

Link: https://drive.google.com/file/d/1Wc9Eeo83xj3Cyp2LZjQrmKS4c1XI-WQq/view

ఈ అభయహస్తం దరఖాస్తు అనేది అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో పూరించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆధార్ కార్డు నెంబర్ రేషన్ కార్డు నెంబర్ గ్యాస్ కనెక్షన్ నెంబర్ మీ భూమి పాసుబుక్ నెంబర్ సర్వే నెంబర్లు కరెంట్ మీటర్ నెంబర్ అమరవీరులు ఉద్యమకారులు జైలు శిక్ష అలాగే ఎఫ్ఐఆర్ నెంబర్ డెత్ సర్టిఫికేట్ వంటి పూర్తి వివరాలు పూరించాలి.

Leave a Comment