రైతు బంధు డబ్బులు: తెలంగాణ రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతు బంధు నిధులు జమ అవుతున్నాయి. అన్నదాతల కష్టాలు తీర్చి వ్యవసాయం దండుగ కాదు.. పండుగ అనే విధంగా సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నారు.
రైతు బంధు
తెలంగాణలో రైతుబంధు సొమ్ము పంపిణీ ప్రణాళిక బద్ధంగా కొనసాగుతుంది. రైతుబంధు పథకానికి సంబంధించి ఏడాదికి రెండు విడతలుగా పదివేల రూపాయలు రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందిస్తుంది. ఇక రబ్బి, ఖరీఫ్ సీజన్లకు ముందే ఎకరానికి 5000 అందించనుంది.
మొదట్లో రైతుబంధు పథకానికి సంబంధించి రైతులకు చెక్కులను అందజేసేది. అయితే చెక్కులను తీసుకున్న రైతులు మళ్లీ బ్యాంకుల వద్దకు వెళ్లి క్యూలో నిలిచిన డబ్బులు తీసుకోవాల్సి వచ్చేది ఈ నేపథ్యంలో అన్నదాతలకు అండగా ఉండేందుకు రైతుబంధు గురించి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది.
రైతు బంధు డబ్బులు
ఈ వెబ్సైట్లోకి వెళ్లి చెక్కులు వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్ కి వెళ్లి చెక్ డిస్టిబ్యూషన్ వెన్యూ షెడ్యూల్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి అక్కడ కనిపించే డ్రాప్ డొమిలిసిన చెక్ చేసుకోవాలి ఇక లబ్ధిదారులు తమ జిల్లాను ఆ తరువాత వారి మండలాలను సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీ మండలంలో చెక్కులు పంపిణీ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవచ్చు.
రైతు బంధు డబ్బులు ఇక తాజాగా గత రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెక్కులకు బదులు నేరుగా అన్నదాతల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది ఇక మీ అకౌంట్లో రైతుబంధు పథకానికి సంబంధించి డబ్బులు పడ్డాయి లేదా తెలుసుకునేందుకు మాత్రం నేరుగా బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది లేదా నెట్ బ్యాంకింగ్ ఉన్న సరిపోతుంది అలా కాకపోతే మీది ఏ బ్యాంకు ఆ బ్యాంకుకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే మీ బ్యాంకు బ్యాలెన్స్ మెసేజ్ మీ మొబైల్ కి వస్తుంది లేకపోతే యూపీఐతాను మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో అని సులభంగా తెలుసుకోవచ్చు.