AP Ration Card Holders – ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు బియ్యానికి బదులుగా ఉచితంగా సజ్జలు,రాగులు పంపిణి చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరో విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది ఏపీలో రేషన్ సరుకుల పంపిణీ వ్యవస్థలో పూర్తి పారదర్శకత మార్పులు తీసుకొస్తూ బియ్యానికి బదులుగా ఉచితంగా రాగులు సజ్జలు, జొన్నలు అందించబోతుంది ఏప్రిల్ నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఈ సరుకుల పంపిణీ ప్రారంభించబోతుంది.
ఏపీ రేషన్ కార్డుదారులకు
ఇటీవల కాలంలో ప్రజలకు ఆరోగ్యం పట్ల అలాగే చిరుధాన్యాల పట్ల బాగా అవగాహన పెరిగింది దీనికి తోడు తాజాగా ఐక్యరాజ్యసమితి 2023న మిల్లెట్ ఇయర్ గా ప్రకటించిన విషయం తెలిసిందే అయితే భారతదేశంలో ఐక్యరాజ్యసమితి చిరుధాన్యాలు సంవత్సరంగా ప్రకటించడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేసే దశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు బియ్యం బదులుగా రాగులు, జొన్నలు, సజ్జలు ఇవ్వాలని నిర్ణయించింది ఏప్రిల్ నెల నుంచి రాయలసీమ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయబోతుంది.
ఇక ప్రతి నెలలో ఇచ్చే రేషన్ సరుకుల పంపిణీ బియ్యం బదులు ఉచితంగా రాగులు సజ్జలు జొన్నలు పంపిణీ చేయబోతుంది దీనివల్ల రేషన్ కార్డుదారులే కాకుండా రైతులకు కూడా ఎంతో మేలు చేసినట్లు అవుతుంది అటు రైతుల ద్వారా చిరుధాన్యాలు సాగు ప్రోత్సహించేలా ఉత్పత్తులు కొనుగోలు చేసి వెంటనే వారికి నగదు చెల్లింపులు చేసే పటిష్ట ఆర్థిక వ్యవస్థను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పౌరసరఫరాల శాఖ రేషన్ దుకాణాల్లో గోధుమపిండిని సైతం పంపిణీ చేస్తుంది ఒక కేజీ గోధుమపిండి ప్యాకెట్ 16 రూపాయలుగా అమ్ముతున్నారు.