తిరుమలలో శ్రీవారి భక్తులకు గమనిక.! ఈ 5 రోజులు పలు సేవలు రద్దు

శ్రీవారి సేవలు | కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు దివ్య క్షేత్రమైన తిరుమలలో నిత్యం భక్తుల రద్దీ తారాస్థాయిలో ఉంటుంది. తాజాగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి సాలికట్ల తెప్పోత్సవాలు మార్చి మూడో తేదీ నుండి ఏడో తేదీ వరకు వైభవంగా జరుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా ఒక ప్రకటనలో వివరించింది.

శ్రీవారి సేవలు

ఇక మార్చి మూడు నుంచి ఏడో తేదీ వరకు ఆ రోజుల్లో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరణలో స్వామి అమ్మవారి భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ తెలిపింది. తెప్పోత్సవాలైన మొదటి రోజు మార్చి మూడో తేదీన సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో తెప్పలపై స్వామి వారు పుష్కరణలో విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు.

మార్చి 4వ తేదీ శ్రీకృష్ణ స్వామి అవతారంలో భక్తులకు మూడుసార్లు దర్శనమిస్తారు ఇక మార్చ్ 5వ తేదీన మలయాప్ప స్వామిగా మార్చి 6వ తేదీన ఐదుసార్లు మార్చ్ ఏడో తేదీన ఏడుసార్లు తెప్పోత్సవం పై పుష్కరిణిలో విహరించి శ్రీవారు భక్తులను కటాక్షిస్తారు.

ఆర్జిత సేవలు రద్దు

ఈ సేవలు కారణంగా పలు ఆర్జిత సేవలు రద్దు చేశారు మార్చి మూడు నాలుగు తేదీల్లో సహస్ర దీపావలంకరణ సేవ మార్చి 5 6 7వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్రదీప అలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తాజాగా ఒక ప్రకటన తెలిపింది అర్చన తోమల సేవ ఏకాంతంగా నిర్వహిస్తారు.

ఆర్జిత సేవలు తేదీలు

మార్చి 3 వ తేదిశ్రీ కులశేఖరాళ్వార్‌ వర్ష తిరు నక్షత్రం
మార్చి 3- 7 వ తేది వరకుశ్రీవారి తెప్పోత్సవాలు
మార్చి 7 వ తేదికుమారధార తీర్థ ముక్కోటి
మార్చి 18 వ తేదిశ్రీ అన్నమాచార్య వర్థంతి
మార్చి 22 వ తేదిశ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది
మార్చి 30 వ తేదిశ్రీరామనవమి ఆస్థానం
మార్చి 31 వ తేదిశ్రీరామ పట్టాభిషేకం ఆస్థానం

ఇలా మార్చి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ప్రత్యేక అప్డేట్ ఇచ్చింది.స్వామి వారి భక్తులు ఈ తేదీలు గమనించి తిరుమల వెళ్ళగలరు.

Leave a Comment