జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 12 రాశులకు రాశి ఫలాలకు అధిక ప్రాణదాన్యత ఉంటుంది. ఇక రాశికి నక్షత్రం కూడా ఉంటుంది పాదం కూడా ఉంటుంది 27 నక్షత్రాలలో ఒక్కొక్క నక్షత్రమునకు నాలుగు పాదాలు ఉంటాయి. 27×4=108.12 రాశుల్లోని 9 పాదములు చొప్పున విభజింపబడినవి 12×9=108.
12 రాశుల మంత్రలు
ఇక మొత్తం 12 రాశులు ఉంటాయి అయితే ఏ రాశి వారు ఏ మంత్రం పఠిస్తే మంచి జరుగుతుందో చూద్దాం. ఇందులో మొదటిగా.
- మేష రాశి వారు -ఓం శ్రీం లక్ష్మీ నారాయణాయ నమః
- వృషభ రాశి -ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయ నమః
- మిధున రాశి -ఓం క్లీం కృష్ణాయ నమః
- కర్కాటక రాశి -ఓం హిరణ్య గర్బాయ అవ్యక్తరూపే నమః
- సింహరాశి – ఓం క్లీం బ్రాహ్మినే జగదాదారాయ నమః
- కన్య రాశి – ఓం హ్రీం పీతాంబరాయ నమః
- తుల రాశి – ఓం తత్వనిరంజన్ ఆరకాయ నమః
- వృశ్చిక రాశి – ఓం నారాయణాయ నరసింహాయ నమః
- ధనుస్సు రాశి – ఓం శ్రీం దేవా కృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః
- మకర రాశి – శనిదేవుడు అధిపతి ఈ రాశి వారు – ఓం శ్రీం వత్సలాయ నమః
- కుంభరాశి – శనిదేవుడు అధిపతి ఈ రాశి వారు – ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః
- మీన రాశి – ఓం శ్రీం ఉదృతాయ ఉద్దరినే నమః
ఇక ఇందులో తెలిపిన 12 రాశుల యొక్క మంత్రాలను ఆయా మంత్రాలను కుదిరితే మీ తల్లిదండ్రులు ద్వారా లేదా గురువు ద్వారా స్వీకరించి ప్రతినిత్యం పఠనం చేయుట వల్ల ఏకాగ్రత, శ్రద్ధ, సంపద కలిగి మంచి జీవితం పొందుతారు.