ఆంధ్రప్రదేశ్లో పరీక్షల షెడ్యూలు మూతమవుతుంది ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఏపీలో ఏప్రిల్ మూడో తేదీ నుంచి 18వ తేదీ వరకు ఎస్ఎస్సి పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరగా ఉన్నాయి ఈసారి కేవలం ఆరు సబ్జెక్టులు నిర్వహణ ఉండనుందని ssc బోర్డు వెల్లడించింది. ఇక పరీక్షల సమయం విషయానికి వస్తే ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్
ఇక సిబిఎస్సి తరహాలోనే పరీక్షలు రోజు మార్చి రోజు పరీక్షలు నిర్వహించబోతున్నారు.
సబ్జెక్టులు వారీగా పరీక్ష తేదీలు ఖరారు
- ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్
- ఏప్రిల్ 6 సెకండ్ లాంగ్వేజ్
- ఏప్రిల్ 8 ఇంగ్లీష్
- ఏప్రిల్ 10 మ్యాథమెటిక్స్
- ఏప్రిల్ 13 సైన్స్
- ఏప్రిల్ 15 సోషల్ స్టడీస్
- ఏప్రిల్ 17 కాంపోజిట్ కోర్స్
- ఏప్రిల్ 18వ తేదీ ఒకేషనల్ కోర్స్ పరీక్షలు ఉండబోతున్నాయి.
తాజాగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలతో కూడిన పరీక్షా విధానాన్ని అమలు చేయబోతుంది. దీంతో ఇప్పటినుండే విద్యార్థులు పరీక్షలకు సంసిద్ధం కావాలని మంచి మార్కులు సాధించి విద్యార్థులు మంచి భవిష్యత్తును సుస్థిరం చేసుకోవాలని AP ప్రభుత్వం విన్నవించింది.