ఏపీఎస్ఆర్టీసీ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే ఇక పండుగ సీజన్లో ప్రజల రద్దీకి అనుగుణంగా జనవరి 6వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 6400 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది తాజాగా ఈ ప్రత్యేక బస్సులపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఒక ముఖ్య ప్రకటన తెలిపారు.
ఏపీఎస్ ఆర్టీసీ
అలాగే ప్రయాణికులు తిరిగి వెళ్లే సమయంలో వాళ్లకోసం జనవరి 15 నుంచి 18వ తేదీ వరకు 3280 ప్రత్యేక బస్సులు నడపబోతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు ఇక పండుగ దృష్ట్యా నడిపే స్పెషల్ బస్సుల్లో ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయబోమని ఈ సందర్భంగా ఆర్టీసీ తెలిపింది.
ఇక సుదూర ప్రాంతాలకు నడిపే సర్వీసులో ముందుగానే రిటర్న్ జర్నీ టికెట్స్ కూడా బుక్ చేసుకుంటే 10% వరకు డిస్కౌంట్ ప్రకటించారు ఇటు తెలంగాణ నుంచి 3600 బస్సులను ఏపీకి నడుపుతున్నారు చెన్నై నుంచి 150 బస్సు సర్వీసులు ఏపీకి నడపబోతున్నారు. అలాగే బెంగళూరు నుంచి 430 బస్సులు ఇటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విజయవాడకు 800 బస్సులు రాజమండ్రి కి 200 బస్సులు విశాఖపట్నానికి 450 బస్సులు ఇతర ప్రాంతాలకు మరో 770 ప్రత్యేక బస్సులు వెళ్తాయి. అన్ని బస్సులను జిపిఎస్ ట్రాకింగ్ ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు.
ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలనుకునేవారు ఏపీఎస్ఆర్టీసీ యాప్ ఏజెంట్లు లేదా వెబ్సైట్ ద్వారా టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు ఇక ప్రయాణికులు కావాల్సిన ఎటువంటి సమాచారం కోసం అయినా ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ కాల్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు ఈ నెంబర్ 24/7 number (0866-2570005) నెంబర్లను కాల్ చేసి మీ సందేహాలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకోవచ్చు.
అంతేకాకుండా ఏపీఎస్ఆర్టీసీలో స్లీపర్ సర్వీస్ అలాగే ఎక్స్ప్రెస్ నాన్ స్టాప్ ఆర్టీసీ స్టార్ లైనర్ వంటి బస్సు సర్వీసులను హైదరాబాద్ విజయవాడ బెంగళూరు చెన్నై విశాఖపట్నం వంటి ప్రముఖ నగరాలకు నడుపుతుంది. ప్రయాణికులు పండుగ సమయంలో ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను వినియోగించుకోవాలని ఆర్టీసీ ప్రయాణికులకు సూచించింది.
ఏపీఎస్ఆర్టీసీ టోల్ ఫ్రీ నెంబర్
ఏపీఎస్ ఆర్టీసీ నెంబర్ : 0866 257 0005
టైమింగ్స్:04:00 నుండి 23:00