తెలంగాణ రైతులకు.! ఈ నెల 28 నుంచి రైతుబంధు నిధులు. ప్రస్తుత యాసంగి పంటలకు సంబంధించి రైతు బంధు సహాయం డిసెంబర్ 28 నుంచి అమలు కాబోతుంది. తెలంగాణ రాష్ట్ర రైతన్ననికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద శుభవార్త తెలిపారు సాగు పెట్టుబడికి అవసరమైన నిధులను విడుదల చేయడానికి తెలంగాణ రాష్ట్ర సర్కార్ సంసిద్ధమయింది. ఏసంగీ సీజన్ కు సంబంధించిన రైతుబంధు పెట్టుబడి సహాయాన్ని ఈనెల 28వ తేదీ నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీనికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును సీఎం కేసీఆర్ గారు ఆదేశించారు.
రైతు బంధు
దీనికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును సీఎం కేసీఆర్ గారు ఆదేశించారు ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఒక ఎకరం నుంచి ప్రారంభించి చివరి రైతు వరకు రైతుబంధు సాయాన్ని అందించనున్నారు ఇక సంక్రాంతి పండుగ వరకు అర్హులైన ప్రతి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు నిధులను విడుదల చేయనున్నారు.
ఇక 2022 సీజన్ కు సంబంధించి సుమారు 66 లక్షల మంది రైతుల కోసం 7600 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు.
కొత్తగా లక్ష మందికి రైతు బందు
దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయంగా రైతుబంధు ద్వారా ఎకరాకు 5000 రూపాయలు చొప్పున ఖాతాలో జమ చేస్తుంది.
రైతు బంధు నిధులు
ఇక రైతులకు సంబంధించిన వివరాలను రెండు మూడు రోజుల్లో రెవెన్యూ శాఖ సీసీఎల్ఏ నుంచి వ్యవసాయ శాఖ సేకరించినది తదుపరి ఈ సీజన్ కు ఎంత మంది రైతులు అర్హులు అనే విషయంలో స్పష్టత రానుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొత్తగా మరో లక్ష మంది రైతులు రైతుబంధు పథకానికి అర్హులుగా పెరిగే అవకాశం ఉంది. “జై తెలంగాణ”.